GT vs SRH Highlights: ఆరెంజ్ ఆర్మీపై గుజరాత్ విజయం.. సీజన్ నుంచి సన్‌రైజర్స్ ‘అస్తమయం’..
Gujarat Titans vs Sunrisers Hyderabad Highlights in Telugu: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 189 పరుగుల టార్గెట్ నిలిచింది.
Gujarat Titans vs Sunrisers Hyderabad Highlights in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో భాగంగా జరిగిన 62వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంకా ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో 8వ ఓటమి కూడా చేరింది, ఫలితంగా ఐపీఎల్ 16వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఇచ్చిన 189 పరుగులు లక్ష్యాన్ని చేధించడంలో ఆరెంజ్ ఆర్మీ పూర్తిగా చేతులెత్తేసిందని చెప్పుకోవాలి. హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ మినహా మిగిలినవారంతా గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో మొహమ్మద్ షమి, మోహిత్ శర్మ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. యష్ దయాల్ ఒకరిని ఔట్ చేశాడు.
ఇక అంతకముందు సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఈ క్రమంలో గుజరాత్ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101 పరుగులు) కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అలాగే ప్రస్తుత సీజన్‌లో సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గిల్‌తో పాటు సాయి సుదర్శన్(47) కూడా రాణించడంతో గుజరాత్ ఆ స్కోర్‌ని చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 5 వికెట్లతో చెలరేగగా.. మార్కో యాన్సన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీసుకున్నారు.
కాగా, నేటి మ్యాచ్‌లో విజయం ద్వారా గుజరాత్ టీమ్ ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు చేరింది. అలాగే ఆరెంజ్ ఆర్మీ రేసు నుంచి తప్పుకుంది.
జట్లు:
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్.
LIVE Cricket Score & Updates
-
GT vs SRH Live Score: ప్లేఆఫ్స్ రేస్ నుంచి హైదరాబాద్ ఔట్..
సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ టీమ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పటికే 7 మ్యాచ్‌ల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ ఈ ఓటమి కారణంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయింది.
-
GT vs SRH Live Score: 12 బంతుల్లో 53 పరుగులు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 12 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. ఇక క్రీజులో భువనేశ్వర్(27), మార్ఖండే(1) ఉన్నారు. సన్‌రైజర్స్ టీమ్ ఇప్పటివరకు జరిగిన 18 ఓవర్ల ఆటలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
-
-
GT vs SRH Live Score: క్లాసెస్ ఔట్.. కష్టాల్లో పడిన ఆరెంజ్ ఆర్మీ..!
సన్‌రైజర్స్ తరఫున దూకుడుగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్(64) కూడా పెవీలియన్ చేరాడు. షమి వేసిన 17వ ఓవర్ 5వ బంతిని క్లాసెన్ గాల్లోకి కొట్టడంతో.. డేవిడ్ మిల్లర్ పట్టేసుకున్నాడు. ఫలితంగా క్లాసెన్ కూడా ఔట్ చేరాడు. క్రీజులో భువీ(20) ఉండగా.. అతనితో మయాంక్ మార్ఖండే జతకట్టాడు.
-
GT vs SRH Live Score: ఇంకా 5 ఓవర్లే.. ఇంకా ఎన్ని పరుగులు చేయాలంటే..?
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకి ఇంకా 5 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. 50 పరుగుల లోపే సగం వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ ఈ ఆటలో గెలవాలంటే ఈ 5 ఓవర్లలో 78 పరుగులు చేయాలి. ఇక క్రీజులో సన్‌రైజర్స్ తరఫున హెన్రిచ్ క్లాసెన్(56), భువనేశ్వర్(17) ఉన్నారు.
-
GT vs SRH Live Score: క్లాసెస్ ఖాతాలో మరో అర్థసెంచరీ..
గుజరాత్ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో కూరుకుపోయినా.. క్లాసెస్ హైదరాబాద్ టీమ్‌కి అండగా నిలిచాడు. అంతేకాక నిలకడగా రాణిస్తూ తన ఖాతాలో మరో హాఫ్ సెంచరీని చేర్చుకున్నాడు.
-
-
GT vs SRH Live Score: 4 వికెట్లు డౌన్..
హైదరాబాద్ 4.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది.
-
GT vs SRH Live Score: 3 వికెట్లు కోల్పోయి హైదరాబాద్..
హైదరాబాద్ 2.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ క్రీజులో ఉన్నాడు.
రాహుల్ త్రిపాఠి ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు.మహ్మద్ షమీ బౌలింగ్ లో అతను రాహుల్ తెవాటియా చేతికి చిక్కాడు. షమీకి ఇది రెండో వికెట్. అన్మోల్‌ప్రీత్ సింగ్ (5 పరుగులు)ను కూడా అవుట్ చేశాడు. 5 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాడు. అతను వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేతికి చిక్కాడు.
-
GT vs SRH Live Score: హైదరాబాద్ టార్గెట్ 189..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 189 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
GT vs SRH Live Score: 56 బంతుల్లో సెంచరీ..
గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 101 పరుగుల వద్ద అవుటయ్యాడు. 56 బంతుల్లో ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించాడు. గిల్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
-
GT vs SRH Live Score: 7 వికెట్లు డౌన్..
గుజరాత్ 19.2 ఓవర్లలో ఏడ వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
-
GT vs SRH Live Score: 5వ వికెట్ డౌన్..
గుజరాత్ 17.3 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.
-
GT vs SRH Live Score: సెంచరీ దిశగా గిల్..
గుజరాత్ 15.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్, మిల్లర్ ఉన్నారు. తన కెరీర్‌లో 18వ ఫిఫ్టీని పూర్తి చేసుకున్న గిల్.. తొలి ఐపీఎల్ సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. 47 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఔటయ్యాడు. వృద్ధిమాన్ సాహా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. హార్దిక్ పాండ్యా 8 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
-
GT vs SRH Live Score: సెంచరీ దాటిన గుజరాత్ స్కోర్..
గుజరాత్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు.
-
GT vs SRH Live Score: గిల్ హాఫ్ సెంచరీ..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న గుజరాత్ 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది. గిల్ తన కెరీర్‌లో 18వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో గిల్‌కి ఇది 5వ అర్ధ సెంచరీ. 22 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. వృద్ధిమాన్ సాహా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
-
GT vs SRH Live Score: పవర్ ప్లేలో దుమ్ము రేపిన గుజరాత్..
తొలుత బ్యాటింగ్ చేస్తోన్న గుజరాత్ 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.
-
GT vs SRH Live Score: తొలి వికెట్ డౌన్..
తొలుత బ్యాటింగ్ చేస్తోన్న గుజరాత్ 2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు. వృద్ధిమాన్ సాహా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అతను భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ చేతికి చిక్కాడు.
-
GT vs SRH Live Score: ఇరుజట్లు..
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్.
-
GT vs SRH Live Score: టాస్ గెలిచిన హైదరాబాద్..
కీలక మ్యాచ్లో హైదరాబాద్ టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
GT vs SRH Live Score: ఇరుజట్ల పోరులో పైచేయి ఎవరిదంటే?
గుజరాత్, హైదరాబాద్ జట్లు రెండూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఒకసారి గుజరాత్, మరోసారి హైదరాబాద్ విజయం సాధించాయి.
-
GT vs SRH Live Score: గెలిస్తే ప్లేఆఫ్స్ రేసులో హైదరాబాద నిలిచే ఛాన్స్..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి 7 మ్యాచుల్లో ఓడిన హైదరాబాద్ టీం.. 8 పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
-
GT vs SRH Live Score: గెలిస్తే ప్లేఆఫ్స్ చేరే తొలిజట్టుగా..
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 12 మ్యాచ్‌ల్లో 8 గెలిచింది. 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. హార్దిక్ సారథ్యంలో గుజరాత్ అద్భుత ప్రదర్శన చేయడంతో ప్రస్తుతం 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా అవతరిస్తుంది.
-
GT vs SRH Live Score: గుజరాత్ ప్లేఆఫ్స్ రేసు ముగిసేనా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు లీగ్ దశలో 62వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Published On - May 15,2023 6:20 PM