AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs PBKS: ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్‌లో 5 ఆసక్తికర విషయాలు.. సై అంటే సై అంటోన్న ప్లేయర్స్..

IPL 2023: ఐపీఎల్ 2023లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీకి ఈ మ్యాచ్ లాంఛనప్రాయమైనప్పటికీ, పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాలనుకుంటోంది.

DC vs PBKS: ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్‌లో 5 ఆసక్తికర విషయాలు.. సై అంటే సై అంటోన్న ప్లేయర్స్..
Dc Vs Pbks
Venkata Chari
|

Updated on: May 13, 2023 | 4:28 PM

Share

Delhi Capitals vs Punjab Kings: ఐపీఎల్ 2023లో, నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీకి ఈ మ్యాచ్ లాంఛనప్రాయమైనప్పటికీ, పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాలనుకుంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన చాలా ఇబ్బందికరంగా ఉంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు 10వ స్థానంలో నిలవడానికి ఇదే కారణం. పంజాబ్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండి ఎనిమిదో స్థానంలో ఉంది. మే 13న ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో కొందరు ఆటగాళ్ల మధ్య వ్యక్తిగత పోటీ కనిపించనుంది. మ్యాచ్‌కి ముందు 5 ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

డేవిడ్ వార్నర్ వర్సెస్ కగిసో రబడ: ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, కగిసో రబాడ మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. టీ20లో వార్నర్‌ను రబాడ ఐదుసార్లు ఔట్ చేశాడు. అయితే ఆ సమయంలో రబాడపై వార్నర్ స్ట్రైక్ రేట్ 149గా నిలిచింది.

డేవిడ్ వార్నర్ వర్సెస్ రాహుల్ చాహర్: పంజాబ్ బౌలర్ రాహుల్ చాహర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ విరుచుకుపడ్డాడు. రాహుల్ వేసిన 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేట్ 179.41గా నిలిచింది.

శిఖర్ ధావన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్: కుల్దీప్ యాదవ్‌పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్‌పై 91.89 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. కుల్దీప్ 6 ఇన్నింగ్స్‌ల్లో శిఖర్‌ను 2 సార్లు ఔట్ చేశాడు.

రిలే రస్సో వర్సెస్ అర్ష్‌దీప్ సింగ్: పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ రిలే రస్సో ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు. అర్ష్‌దీప్ మూడు ఇన్నింగ్స్‌ల్లో రూసోను మూడుసార్లు ఔట్ చేశాడు.

పంజాబ్ చెత్త ఎకానమీ రేటు: ప్రీమియర్ లీగ్ 2023లో పంజాబ్ చెత్త ఎకానమీ రేటును కలిగి ఉంది. 16, 20 ఓవర్ల మధ్య పంజాబ్ బౌలర్ల ఎకానమీ రేటు 11.20గా నిలిచింది. ఈ విషయంలో ముంబై ఇండియన్స్‌ వెనుకంజలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..