Suryakumar Yadav: భార్యపై ట్రోల్స్.. తుఫాన్ సెంచరీతో ఘాటుగా రిప్లై ఇచ్చిన సూర్య..

Suryakumar Yadav Wife Devisha Shetty: సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో తొలి సెంచరీ కొట్టాడు. ఈసారి తన సెంచరీని భార్య దేవిషా చూడగలిగినందుకు సూర్య మరింత ఆనందంగా ఉన్నాడు.

Suryakumar Yadav: భార్యపై ట్రోల్స్.. తుఫాన్ సెంచరీతో ఘాటుగా రిప్లై ఇచ్చిన సూర్య..
Surya Kumar Yadav
Follow us
Venkata Chari

|

Updated on: May 13, 2023 | 4:11 PM

గుజరాత్ టైటాన్స్‌పై సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 49 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేసి ముంబైని 27 పరుగుల తేడాతో గెలిపించాడు. ఐపీఎల్‌లో సూర్యకు ఇది తొలి సెంచరీ కాగా, టీ20 క్రికెట్‌లో నాలుగో సెంచరీ. సూర్య ఈ సెంచరీ కొట్టడమే కాదు.. సెంచరీ చేసిన తర్వాత తన భార్య దేవిషాపై దాడి చేసే వారికి ఘాటుగా సమాధానం చెప్పేశాడు.

ఈ విషయాన్ని సూర్య స్వయంగా వెల్లడించాడు. మ్యాచ్ అనంతంర సూర్య వీడియోను ఐపీఎల్ తన సోషల్ మీడియిలో పంచుకుంది. అందులో ముంబై బౌలర్ ఆకాష్ మధ్వల్ సూర్య తుఫాను ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. తొలి ఐపీఎల్ సెంచరీపై ఎలా ఫీలవుతోందంటూ అడిగాడు.

సూర్య సమాధానం..

ఫ్యామిలీ అంతా చూడ్డం ఆనందంగా ఉందన్నాడు సూర్య. దేవిషా స్టేడియంలోనే ఉందని, తన భార్య ముందు సెంచరీ కొట్టడం చూడ్డానికి బాగుందని ఈ తుఫాను బ్యాట్స్‌మెన్ పేర్కొన్నాడు.

అయితే, దేవిషా సూర్య చేసిన మూడు అంతర్జాతీయ T20 సెంచరీలను చూడలేకపోయింది. దీనిపై ఇంతకుముందు బాగా ట్రోల్స్ వచ్చాయి. ఆమె స్టేడియంలో లేకపోవడంతోనే సెంచరీ చేశావని, స్టేడియంలో ఉంటే సెంచరీలు రావంటూ సూర్య భార్యను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో సూర్య చేసిన తాజా సెంచరీకి ఆయన భార్య కూడా ప్రత్యక్షంగా చూసింది. దీంతో ఇప్పుడు ట్రోలర్స్‌కు గట్టిగా సమాధానం ఇచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. సూర్య భార్య దేవిషా స్టేడియానికి వచ్చిందని, అందుకే సెంచరీ చేయలేకపోయిందని చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతర్జాతీయ సెంచరీలను చూడలేకపోయిన సూర్య భార్య..

సూర్య ఇంతకుముందు ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీ20 క్రికెట్‌లో సెంచరీలు సాధించాడు. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ దేవిషా స్టేడియంలో దు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో కొందరు ట్రోలర్లు దేవిషాను టార్గెట్ చేశారు.

సూర్య బ్యాటింగ్ గురించి మాట్లాడితే.. అతను మొదటి 31 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత తదుపరి 18 బంతుల్లో 56 పరుగులు చేసి తన మొదటి IPL సెంచరీని పూర్తి చేశాడు . 16వ ఓవర్ పూర్తయిన తర్వాత సూర్యను అడ్డుకోవడం బౌలర్లకు కష్టతరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..