IPL 2023 Playoff Scenario: ఇదేందిరయ్యా.. ఇంత గందరగోళం.. క్లారిటీ లేని ప్లేఆఫ్స్.. టాప్ 4టీంలకు భారీ షాక్?

Playoff Scenario after CSK vs KKR match: ప్లేఆఫ్‌ల సమీకరణం చాలా క్లిష్టంగా తయారైంది. ప్రస్తుతం మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లలో ఏవైనా రెండు లేదా మూడు జట్లు.. రేసు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

IPL 2023 Playoff Scenario: ఇదేందిరయ్యా.. ఇంత గందరగోళం.. క్లారిటీ లేని ప్లేఆఫ్స్.. టాప్ 4టీంలకు భారీ షాక్?
Ipl 2023 Playoffs Race
Follow us
Venkata Chari

|

Updated on: May 15, 2023 | 5:04 PM

ఐపీఎల్ 2023 ప్లేఆఫ్‌ల పజిల్ 61 మ్యాచ్‌ల తర్వాత కూడా అపరిష్కృతంగా మారింది. ఊహించని ఫలితాలో.. ప్రస్తుతం ఉన్న టాప్ 4 జాబితాపై గందరగోళం నెలకొంది. ఇక్కడ చివరి వరకు సస్పెన్స్ ఉంది. నిన్నమొన్నటి వరకు క్వాలిఫై అయిన జట్లే టాప్ 4లో నిలిచిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ జట్ల మెడపైనా కత్తి వేలాడుతోందనేది తాజా వాస్తవం.

టోర్నీలో ప్లేఆఫ్‌లు దగ్గరపడ్డాయి. సగానికి పైగా మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఇప్పుడు కూడా ప్లేఆఫ్స్‌కు సంబంధించి ఏ ఒక్క జట్టు పేరు కూడా ఫైనల్ చేయని పరిస్థితి నెలకొంది. పాయింట్ల పట్టికను చూస్తే.. కచ్చితంగా అయోమయానికి గురయ్యేలా ఉంది.

టాప్ 4 జట్లలో పాయింట్ల తేడాలు స్వల్పమే..

కోల్‌కతా చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి తర్వాత పాయింట్ల పట్టిక సమీకరణం మరింత క్లిష్టంగా మారింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో గుజరాత్ మునుపటిలా 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు కోల్‌కతా చేతిలో ఓడిపోయిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో స్థానం కోల్పోకపోయినా.. తనకు తానుగా సమస్య సృష్టించుకుంది.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్‌పై గెలిచిన లక్నో 2 పాయింట్లు దక్కించుకుని నాలుగో స్థానంలో నిలిచింది. లక్నోకు 13 పాయింట్లు ఉండగా.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న ఈ టాప్ 4 జట్ల మధ్య కేవలం 1 పాయింట్ తేడా మాత్రమే ఉంది. అదే సమయంలో, చెన్నైకి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన జట్లకు ఇంకా తలో 2 మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి.

4 జట్ల ఖాతాలో తలో 12 పాయింట్లు..

పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న బెంగళూరు, రాజస్థాన్, కోల్‌కతా, పంజాబ్‌లకు 12 పాయింట్లు ఉన్నాయి. ఈ నాలుగు జట్లలో ప్లేఆఫ్‌కు చేరుకోవడం విషయానికి వస్తే.. బెంగళూరుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది, బెంగళూరు రన్‌రేట్ మిగిలిన వారి కంటే మెరుగ్గా ఉంది. రెండవది, ఆర్సీబీ మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మిగిలిన టీంలలో పంజాబ్‌లో కూడా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ దాని రన్‌రేట్ మైనస్‌లో ఉంది.

రాజస్థాన్ జట్టు రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. ఇది ప్లస్‌లో ఉంది. కానీ సమస్య ఏమిటంటే ఆజట్టుకు కేవలం 1 మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అంటే గెలిచిన తర్వాత కూడా 14 పాయింట్లకు చేరుకోవచ్చు. అదే విధంగా, కోల్‌కతా కూడా గరిష్టంగా 14 పాయింట్లను చేరుకోగలదు. అయితే మైనస్ రన్‌రేట్ అడ్డంకిగా మారుతుంది.

ప్లేఆఫ్‌లకు గుజరాత్‌కు కేవలం ఒక విజయం దూరంలో..

పాయింట్ల పట్టికలో, 5 జట్ల రన్ రేట్ ప్లస్‌లో ఉంది. ఆ ఐదు జట్లలో 4 జట్లకు ఇంకా తలో 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అంటే ప్లేఆఫ్‌ల మార్గంలో మరింత ఉత్కంఠ నెలకొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన వెంటనే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం.. బెంగళూరుతో జరిగే చివరి మ్యాచ్‌పై ఆధారపడవలసి ఉంటుంది. అంటే గుజరాత్ గరిష్టంగా 20 పాయింట్లకు లేదా 18 పాయింట్లకు చేరుకుంటుంది. లేకుంటే గ్రూప్ దశను 16 పాయింట్ల వద్ద మాత్రమే ముగించగలదు.

ఢిల్లీపై CSK విజయం తప్పనిసరి..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సిన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో CSK గెలిస్తే 17 పాయింట్లతో పాటు ప్లేఆఫ్‌కు వెళ్లవచ్చు. కానీ, ఓడిపోతే 15 పాయింట్లతో గ్రూప్ దశలో ఉంటుంటి. అయితే, మిగతా జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్, సన్‌రైజర్స్‌తో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సమస్య ఏమిటంటే, ముంబయి మాదిరిగానే లక్నో కూడా ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే విజయం సాధించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టాప్‌ ఫోర్‌లో నిలిచిన ఈ రెండు జట్లు ఢీకొనడం కీలకంగా మారింది.

ముంబై ఇండియన్స్‌తో పాటు, లక్నో కోల్‌కతాతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. CSKని ఓడించి ఉత్సాహంగా ఉంది. ప్లేఆఫ్‌పై KKR ఆశలు ఇంకా ముగియలేదు. ఇటువంటి పరిస్థితిలో తన చివరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కోరుకుంటుంది. అంటే లక్నోకి వెళ్లే మార్గం కష్టంగా లేదు.

RCB ముందు గుజరాత్ కష్టమే..

బెంగళూరు ఒక మ్యాచ్‌ సన్‌రైజర్స్‌తో, మరొకటి గుజరాత్‌తో ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే రెండింటిలోనూ గెలవాల్సి ఉంది. అదేవిధంగా పంజాబ్‌ను కూడా ఓడించడం రాజస్థాన్ రాయల్స్‌కు తప్పనిసరిగా మారింది.

మొత్తంమీద, IPL 2023 ప్లేఆఫ్‌ల గణితం చాలా క్లిష్టంగా మారింది. ప్రస్తుతం మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లలో ఏదైనా రెండు లేదా మూడు తప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!