Mosquitoes: దోమలు కుడుతున్నాయా? ఐతే మీ ఇంట్లో ఈ చిన్న మార్పులు చేయండి

కొద్ది కొద్దిగా వాన జల్లులు ప్రారంభమవుతాయి. రెండు చినుకులు పడ్డాయోలేదో దోమలు దాడికి సిద్ధమైపోతాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బుగ్గ మీద కసుక్కున కుట్టి నిద్రకు భంగం కలిగిస్తాయి. మెలకువ రాగానే ఫట్‌ మని ఒక్కటిస్తే చెంప పగులుతుందే గానీ దోమ చావదు. కసితీరా చంపుదామనుకుంటే..

Mosquitoes: దోమలు కుడుతున్నాయా? ఐతే మీ ఇంట్లో ఈ చిన్న మార్పులు చేయండి
Mosquito
Follow us
Srilakshmi C

|

Updated on: May 15, 2023 | 7:24 PM

కొద్ది కొద్దిగా వాన జల్లులు ప్రారంభమవుతాయి. రెండు చినుకులు పడ్డాయోలేదో దోమలు దాడికి సిద్ధమైపోతాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బుగ్గ మీద కసుక్కున కుట్టి నిద్రకు భంగం కలిగిస్తాయి. మెలకువ రాగానే ఫట్‌ మని ఒక్కటిస్తే చెంప పగులుతుందే గానీ దోమ చావదు. కసితీరా చంపుదామనుకుంటే రెప్పపాటులో చేతికి అందకుండా ఎగిరిపోతుంది. చెవి దగ్గర చేరి జుయ్‌ మంటూ మోత మోగిస్తూనే ఉంటాయి. అప్పుడు వచ్చే చిరాకు అంతా ఇంతా ఉండదు. ఇక దోమల నివారణకు దోమల బ్యాట్లూ, రిపెల్లెంట్లకు వందలూ వేలూ తగలెయ్యడమేగానీ దోమల బెడద మాత్రం తగ్గదు. మరికొంత మంది మస్కిటో కాయిల్స్‌, ఫ్లాష్ పేపర్ ఉపయోగిస్తారు. దోమలు పారిపోవడమేమోగానీ.. వాటి వల్ల వచ్చే పొగ ముప్పుతిప్పలు పెడుతుంది. ఐతే దోమలను సహజ పద్ధతుల్లో కూడా పారదోలవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే..

నిమ్మ గడ్డి గురించి తెలిసే ఉంటుంది. కొన్ని రకాల ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. నిమ్మగడ్డిని ఇంట్లో చిన్న తొట్టెల్లో పెంచుకోవడం వల్ల దోమలు పరారవుతాయి. దీని వాసన చాలా ఘాటుగా ఉండటం వల్ల దోమలు ఇంట్లో నిలవకుండా వెళ్లిపోతాయి. అలాగే లావెండర్ మొక్కను కూడా ఇంట్లో పెంచుకుంటే దోమల బెడద ఉండదు. తులసి మొక్కలు కూడా దోమలను పారదోలడంతో సహాయపడుతాయి. దోమల నివారణకు చాలా ఇళ్లలో తులసి మొక్కలు పెంచుతారు. దీని ఆకుల వాసన దోమలకు అస్సలు నచ్చదట. అలాగే పుదీనా మొక్కలు కూడా ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు ఇంట్లోకి ప్రవేశించవని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.