Chandramukhi 2: చంద్రముఖి సీక్వెల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..! ఇంతకీ ఎప్పుడంటే..
దాదాపు 17 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా చంద్రముఖి-2 సినిమాను దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మువీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించనున్నారు. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మువీలో..
Updated on: May 15, 2023 | 3:55 PM

పి వాసు దర్శకత్వంలో 2005లో విడుదలైన తమిళ క్లాసిక్ చిత్రం చంద్రముఖి 500 రోజులకు పైగా థియేటర్లను షేక్ చేసి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మువీ ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇక ఈ మువీ విడుదలైన దాదాపు 17 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా చంద్రముఖి-2 సినిమాను దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మువీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించనున్నారు. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మువీలో వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శ్రుతి డాంగే, సుభిక్ష కృష్ణన్, రవి మారియా, కార్తీక్ శ్రీనివాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చగా, సినిమాటోగ్రాఫర్ రవివర్మ అందిస్తున్నారు.

చంద్రముఖి–2 షూటింగ్ మరో పది రోజుల్లో పూర్తికానున్నట్లు నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

'చంద్రముఖి 2' సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ మే 15 నుంచి మైసూర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. జూన్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న గణేష్ చతుర్థికి విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.





























