Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పిలుపు.. తారక్‌ ఎలా స్పందిస్తారో మరి..!

జూనియర్‌ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం నాయకుల నుంచి పిలుపు అందింది.. ఎప్పటినుంచో రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ కు అకస్మాత్తుగా పిలుపు అందటం ఏంటని ఆలోచిస్తున్నారా..? ఈ ప్రశ్న రావడం సహజం.. కానీ, జూనియర్‌ ఎన్టీఆర్‌కు పిలుపు ఎందుకు అందిందంటే..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పిలుపు.. తారక్‌ ఎలా స్పందిస్తారో మరి..!
Jr Ntr
Follow us

|

Updated on: May 15, 2023 | 4:07 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం నాయకుల నుంచి పిలుపు అందింది.. ఎప్పటినుంచో రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ కు అకస్మాత్తుగా పిలుపు అందటం ఏంటని ఆలోచిస్తున్నారా..? ఈ ప్రశ్న రావడం సహజం.. కానీ, జూనియర్‌ ఎన్టీఆర్‌కు పిలుపు ఎందుకు అందింది అంటే.. నటసార్వభౌముడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరవ్వాలంటూ జూ ఎన్టీఆర్ కు..  నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ సావనీర్ కమిటీ చైర్మన్, టీడీపీ నేత టీడీ జనార్థన్ ఆహ్వానం అందించారు. అయితే, ఆహ్వానం అందింది.. జూనియర్‌ ఏం చేస్తారు..! వెళ్తారా.. లేదా.. ఇప్పుడిదే చర్చ..! అన్నగారి కుటుంబం ఫ్యామిలీ ఫంక్షన్లలో అంతా ఒకటిగానే కనిపిస్తున్నా.. తెలుగుదేశం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వచ్చేసరికి చిన్నపాటి తేడా కనిపిస్తోంది. ఈ కారణం వల్లే తారక్‌ వెళ్తారా.. లేదా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. అంతకుముందు జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు పిలుపు అందలేదు.. అయితే.. ఎన్టీఆర్‌ను చాలాకాలం తర్వాత టీడీపీ నాయకులు కలవడం.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తారక్‌ నిర్ణయంపై నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

నందమూరి కుటుంబం హాజరవుతుందా..?

20న హైదరాబాద్‌ కైతలాపూర్‌లో NTR శతజయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ తోపాటు.. కల్యాణ్‌ రామ్‌, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి కుటుంబం మొత్తానికి కమిటీ ఆహ్వానాలు అందించింది. అయితే, ఎన్టీఆర్‌ జయంతి మే 28న రాజమండ్రిలో లక్షల మందితో ఘనంగా మహానాడు జరగనుంది. అదేరోజు.. మహానాడులో ధూమ్‌ధామ్‌గా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి నారా కుటుంబంతోపాటు.. అన్నగారి కుటుంబం మొత్తం హాజరవుతుందా..? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.

Kalyan Ram

ఇవి కూడా చదవండి

ఖమ్మంలో..

అదేరోజు 28న ఖమ్మం లకారం చెరువు దగ్గర భారీ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుంది. దానిని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆవిష్కరించనున్నారు. అదే రోజు రాజమండ్రిలో జరిగే.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు పిలుపు వస్తుందా ..? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.. ఒకవేళ ఆహ్వానం అందితే.. జూనియర్‌ రియాక్షన్‌ ఏంటీ..? అనేది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..