Telangana : తెలంగాణలో మరో స్కాం బట్టబయలు..! లగ్జరీ కార్ల ఓనర్లకు ఈడీ నోటీసులు..

హైదరాబాద్‌లో లగ్జరీ కార్స్ కు, .. ముఖ్యంగా విదే శాల నుంచి దిగుమతి చేసుకున్న వాటికి కొదువలేదు. అయితే అవన్నీ టాక్సులు కట్టి దిగుమతి చేసుకున్నవేనా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. అందుకే లగ్జరీ కార్ల జాబితాను.. దగ్గర పెట్టుకుని ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ కేసులోనూ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.

Telangana : తెలంగాణలో మరో స్కాం బట్టబయలు..! లగ్జరీ కార్ల ఓనర్లకు ఈడీ నోటీసులు..
Luxury Cars
Follow us
Jyothi Gadda

|

Updated on: May 15, 2023 | 1:52 PM

తెలంగాణలో మరో లగ్జరీ కార్ల స్కాం వెలుగు చూసింది. హైదరాబాద్‌లో బడా బాబులకు ఈడీ నోటీసులు అందాయి. లగ్జరీ కార్ల కొనుగోలుదారులపై ఈడీ నిఘా పెట్టింది. టాక్స్ చెల్లించని వ్యాపారులపై విచారణ నిర్వహించారు. కోట్ల విలువైన కార్లను బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. లగ్జరీ కార్లు కొని వ్యాపారులు పన్నులు ఎగ్గొట్టారు. ఈ స్కాంలోనూ కేసినో కింగ్ గా ప్రసిద్ధి పొందిన చికోటి ప్రవీణ్ ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. చీకోటి ప్రవీణ్ తో పాటు నసీర్, మోసీన్‌ అనే వ్యక్తలకు ఈడీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15వ తారీఖున చికోటి ప్రవీణ్‌ను ఈడీ విచారించునుంది.

గతంలోనూ ఇలాంటి స్కాం వెలుగు చూసింది. విదేశీ రాయబారుల పేరుతో ఖరీదైన కార్లను దిగుమతి చేసుకొని పన్నులు ఎగ్గొడుతున్న వ్యవహారంపై ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ‘ఆపరేషన్ మాంటేకార్లో’ పేరుతో 2021లో దర్యాప్తు నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి చెందిన చాలా మంది ముంబై ముఠా నుంచి కార్లు కొనుగోలు చేశారు. ఇవన్నీ టాక్సులు కట్టకుండా దిగుమతి చేసినవే. గడిచిన ఐదేళ్లలో ముంబై పోర్టుకు దిగుమతి అయిన 50 వరకూ కార్లలో చాలా మట్టుకు హైదరాబాద్ లో అమ్మారని డీఆర్ఐ అధికారులు కేసులు నమోదు చేశారు.

కోటిపైనే ధర ఉండే కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినీ తారలు కొనుగోలు చేస్తుంటారు. విదేశాల నుంచి తెప్పించే విలాసవంతమైన కార్లకు భారీగా పన్నులు చెల్లించాల్సిఉంటుంది. విలువపై 204 శాతం దిగుమతి సుంకం కింద చెల్లించాలి. అయితే దేశంలోని విదేశీ రాయబారులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఈ వాహనాలకు మారుమూల ప్రాంతాల్లో ఉన్న రవాణాశాఖ కార్యాలయాల్లో దళారుల్లో రిజిస్ట్రేషన్ చేయింంచేవారు. ఆ స్కాంకు ప్రస్తుతం .. చీకోటి ప్రవీణ్ కు నోటీసులు జారీ చేసిన స్కాంకు సబంధం ఉందేమో వెల్లడి కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో లగ్జరీ కార్స్ కు.,. ముఖ్యంగా విదే శాల నుంచి దిగుమతి చేసుకున్న వాటికి కొదువలేదు. అయితే అవన్నీ టాక్సులు కట్టి దిగుమతి చేసుకున్నవేనా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. అందుకే లగ్జరీ కార్ల జాబితాను.. దగ్గర పెట్టుకుని ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ కేసులోనూ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. చీకోటి ప్రవీణ్ ఇప్పటికే కేసినో వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేయడంతో మొత్తం లెక్కలు బయటకు తెచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు