Watch: ఇదేం క్రూరమైన వంటకం రా సామీ.. మామిడితో ఆమ్లెట్‌..! ఈ హింస మాకొద్దంటున్న నెటిజన్లు..

ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, మీ వంటకంలో మామిడి ఏడుస్తోంది' అని రాశారు. మరొక వినియోగదారు, మీరెందుకు ఇలాంటి క్రూరమైన వంటకాలు చేస్తున్నారు అని రాయగా, మరోకరు మాత్రం ఈ హింసను ఇక ఆపేయండి అంటూ కామెంట్‌ చేశారు. మరొక వినియోగదారు.. 'దయచేసి మామిడి రసాన్ని పాడుచేయవద్దు' అని రాశారు.

Watch: ఇదేం క్రూరమైన వంటకం రా సామీ.. మామిడితో ఆమ్లెట్‌..! ఈ హింస మాకొద్దంటున్న నెటిజన్లు..
Mango Omelette
Follow us
Jyothi Gadda

|

Updated on: May 15, 2023 | 11:37 AM

వేసవి వచ్చిందంటే మార్కెట్లోకి పండ్లలో రారాజు మామిడి వచ్చేస్తుంది. చాలా మందికి మామిడి పండ్లంటే పట్టలేనంత ఇష్టం ఉంటుంది. అయితే, కొందరు మామిడిని యధాతథంగా తినడానికి ఇష్టపడతారు. మరికొందరు మామిడితో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలా తయారు చేసుకున్నే మామిడి స్పెషల్‌ వంటకాలను చాలా మంది ఇష్టపడతారు. పుల్లపుల్లగా, తీయతీయగా రుచి తగిలే మామిడి కాయలను నచ్చినట్టుగా తింటే ఆ రుచే వేరు. తినే కొద్దీ మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మామిడి కాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటితో వండిన వంటకాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే, మామిడి పండ్లతో తయారు చేసిన ఒక విచిత్ర వంటకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కావాలంటే ఇక్కడ వీడియోని చూడండి. నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అని మీరే అంటారు. పండ్లలో రారాజు అయిన మామిడి పండుతో తయారు చేసిన మ్యాంగో పానీ పూరీ, మ్యాంగో పిజ్జా వంటి విచిత్రమైన ఆహార పదార్థాలను ఇప్పటికే నెటిజన్లు ఆస్వాదించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మ్యాంగో ఆమ్లెట్ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవ్వడంతోపాటు మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా చాలామంది గుడ్డుతో చేసిన వంటలను ఇష్టపడతారు. అలాగే ఆమ్లెట్ కూడా అందరికీ ఇష్టమైనది. మరోవైపు, మామిడి చాలా ప్రత్యేకమైన వేసవి పండు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ రెండింటీతో కలిసి ఒక స్ట్రీట్ ఫుడ్ విక్రేత ఆమ్లెట్ తయారు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. thegreatindianfoodie అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో విక్రేత మొదట వేడి పాన్‌పై నూనె పోసి, వేయించడానికి రెండు గుడ్లను పగులగొట్టి పోశాడు. వాటిని ఆఫ్‌ బాయిల్ అవగానే పక్కకు తీసేసుకున్నాడు. ఆ తర్వాత ఉడకబెట్టిన గుడ్డులోని పచ్చసొనలు రెండు పాన్‌మీద వేశాడు. మిరపకాయలు, మసాలా దినుసులు అన్నీ వేసి కలుపుతాడు. అందులో మామిడి రసాన్ని కూడా కలిపాడు. కాసేపు ఫ్రైలాగా చేశాడు.. ఇది సిద్ధంగా ఉన్నప్పుడు, అతను ముందుగా తయారు చేసిన ఆమ్లెట్ మీద ఈ మొత్తం మిశ్రమాన్ని పోశాడు.. ఆగండి ఆగండి.. అప్పుడే రెసిపీ పూర్తవలేదు.. అదనంగా ఆ ఆమ్లెట్‌కు అతను ఉడికించిన గుడ్లను సుగంధ ద్రవ్యాలు, మామిడి రసంతో కలిపి సర్వ్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 822,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు చేసారు. వీడియో చూసిన తర్వాత యూజర్లు అద్భుతమైన కామెంట్స్ చేయడం కనిపించింది. ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, మీ వంటకంలో మామిడి ఏడుస్తోంది’ అని రాశారు. మరొక వినియోగదారు, మీరెందుకు ఇలాంటి క్రూరమైన వంటకాలు చేస్తున్నారు అని రాయగా, మరోకరు మాత్రం ఈ హింసను ఇక ఆపేయండి అంటూ కామెంట్‌ చేవారు. మరొక వినియోగదారు.. ‘దయచేసి మామిడి రసాన్ని పాడుచేయవద్దు’ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!