Hyderabad: గాంధీ ఆస్పత్రి డెడ్ బాడీ కేసులో ట్విస్ట్.. 400 సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు.. గూగుల్‌పేతో గుట్టురట్టు..

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన జితేందర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 400 సీసీ కెమెరాలను పరిశీలించి హత్య కేసుగా నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.

Hyderabad: గాంధీ ఆస్పత్రి డెడ్ బాడీ కేసులో ట్విస్ట్..  400 సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు.. గూగుల్‌పేతో గుట్టురట్టు..
Gandhi Hospital Dead Body C
Follow us

|

Updated on: May 15, 2023 | 9:07 AM

గాంధీ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించిన కేసులో అసలు మిస్టరీ వీడింది. గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో మృతదేహాన్ని వదిలి గుర్తుతెలియని వ్యక్తి వెళ్లిపోయాడు. అనుమానాస్పద మృతదేహాలను గుర్తించిన గాంధీ ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గాంధీ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన జితేందర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 400 సీసీ కెమెరాలను పరిశీలించి హత్య కేసుగా నిర్ధారించారు. గచ్చిబౌలిలో జితేందర్‌పై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టమైంది. అయితే అతడు చనిపోయాడని తెలుసుకున్న నిందితుడు గాంధీ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటోడ్రైవర్‌కు ఇచ్చిన గూగుల్ పే నంబర్ ఆధారంగా.. డబ్బు విషయంలో జితేందర్‌తో గొడవపడి తపస్ అనే వ్యక్తి అతన్ని కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. చిలకలగూడ పోలీసులు ఈ హత్య కేసును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం వెతకడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..