News Watch Live: చంద్రబాబు ఇల్లు సీజ్‌.! చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్..! వీక్షించండి న్యూస్ వాచ్.

News Watch Live: చంద్రబాబు ఇల్లు సీజ్‌.! చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్..! వీక్షించండి న్యూస్ వాచ్.

Anil kumar poka

|

Updated on: May 15, 2023 | 8:19 AM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగిలింది. కరకట్టపై ఉన్న చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను వైసీపీ సర్కార్ అటాచ్ చేసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి నారాయణతో కలిసి తమ పదవును దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారనే ఆరోపణలతో..

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగిలింది. కరకట్టపై ఉన్న చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను వైసీపీ సర్కార్ అటాచ్ చేసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి నారాయణతో కలిసి తమ పదవును దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారనే ఆరోపణలతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సీఆర్డీయే మస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని.. కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలు నమోదయ్యాయి. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే వీళ్లు తమ పదవులను వినియోగించుకొని తమ బంధువులు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహించారంటూ అభియోగాలు వచ్చాయి. అయితే వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ఇందుకు ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండ్‌మెంట్ 1944 చట్టం ప్రకారం ఆ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలని సీబీఐ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను అధికారులు అటాచ్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!