AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekend Hour: క్లైమాక్స్‌కు చేరిన పొత్తుల కథా చిత్రమ్.. వచ్చే ఎన్నికల్లో ద్విముఖ పోరేనా..?

Weekend Hour: క్లైమాక్స్‌కు చేరిన పొత్తుల కథా చిత్రమ్.. వచ్చే ఎన్నికల్లో ద్విముఖ పోరేనా..?

Shaik Madar Saheb

|

Updated on: May 14, 2023 | 7:07 PM

అనుమానాలు తొలిగిపోతున్నాయి. డౌట్లపై క్లారిటీ వస్తోంది. టైమ్ గడుస్తున్న కొద్దీ పిక్చర్ క్లియర్ అవుతోంది. ఎపీలో పొత్తుపొడుపుల కథా చిత్రమ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే కనిపిస్తోంది. కర్నాటక రిజల్ట్స్ తర్వాత BJP ఆలోచన కూడా మారుతోందా?. పవన్‌ పెట్టిన ప్రతిపాదనకు త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందా? వచ్చే ఎన్నికల్లో ఇక ద్విముఖ పోరేనా?

ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఏపీ రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. సింహం సింగిల్‌గానే వస్తుందని ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసింది అధికార వైసీపీ. ఎటొచ్చీ తేల్చుకోవాల్సింది విపక్షాలే. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకో టీజర్‌ వస్తూనే ఉంది. కానీ అదే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. పొత్తులు ఖాయం అని తెలుస్తున్నా..ఆ ముగ్గురు పాత మిత్రులు మళ్లీ ఒక్కటవుతారా లేదా అన్నదే అసలు ప్రశ్న..

పొత్తుల విషయంలో TDP-జనసేన స్పష్టతతోనే ఉన్నాయి. బీజేపీ నుంచి అందాల్సిన సిగ్నల్సే ఆలస్యం అవుతున్నాయి. అయితే కర్నాటక రిజల్ట్స్ తర్వాత కమలనాథులు కూడా పునరాలోచనలో పడ్డారా అన్న చర్చ మొదలైంది. ఏపీలోని పరిస్థితిపై ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. త్వరలోనే పవన్ కోరుకునే కాంబినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ వస్తుందన్న టాక్ నడుస్తోంది. అటు టీడీపీతో పొత్తు అంశాన్ని పవన్, BJP హైకమాండ్ దగ్గర కూడా ప్రస్తావించినట్లు GVL చెప్పడం మారబోయే ఈక్వేషన్స్‌కు సంకేతంగా చూడొచ్చంటున్నారు..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే.. టీడీపీని కూడా కలుపుకోవాల్సిందే అంటున్నారు పవన్. త్రిముఖ పోటీలో బలికావడానికి సిద్ధంగా లేమని ఇప్పటికే తేల్చాశారు. జనసేన, తెలుగుదేశం, BJP పొత్తు ఖాయమని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారయన. ఇప్పటికే BJP పెద్దలు, చంద్రబాబుతోనూ ఈ అంశంపై చర్చించారు. ఒక్కసారి కమలనాథులు సై అన్నారంటే ఆ తర్వాత అసలు మ్యాటర్ మొదలవుతుంది. ఎవరికి ఎన్ని సీట్లు అన్నది తేలాలంటే ఇంకాస్త టైమ్ పడుతుందంటున్నారు జనసేన నేతలు..

పవన్ కల్యాణ్‌ ఇప్పటికైనా తన ముసుగుని తొలిగించి.. మా నాయుడుకు చంద్రబాబే అని ధైర్యంగా చెప్పాలని సవాల్ విసురుతోంది వైసీపీ. టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా ఎంత మంది కలిసొచ్చినా తమకు ఇబ్బంది లేదంటోంది. 2019లో వచ్చిన సీట్లకంటే ఎక్కువే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రులు..

ప్రస్తుత పరిస్థితులు, నేతల మాటలను బట్టి చూస్తే 2024లో జరిగేది ద్విముఖ పోరేనని స్పష్టం అవుతోంది. YCP ఒకవైపు, విపక్షాలు ఒకవైపు. ! మరి జనం ఎటువైపు నిలుస్తారన్నది తేలాల్సి ఉంది.