TS EAMCET: తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈరోజే కీ విడుదల, ఏవైనా అభ్యర్థనలు ఉంటే..
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు, ఆరు విడుతల్లో జరిగిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఇదిలా ఉంటే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక 'కీ'ని అధికారులు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి 8 గంటలకు 'కీ' పేపర్‌ను...

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు, ఆరు విడుతల్లో జరిగిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఇదిలా ఉంటే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని అధికారులు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి 8 గంటలకు ‘కీ’ పేపర్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయమై ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదలా ఉంటే ప్రాథమిక ‘కీ’పై ఏమైనా అభ్యర్థనలు ఉంటే విద్యార్థులు 17వ తేదీ రాత్రి 8 గంటలకు వెబ్‌సైట్లోని లింక్ ద్వారా పంపవచ్చని అధికారులు తెలిపారు. అనంతరం పూర్తి స్థాయిలో కీని విడుదల చేస్తారు. ఇక ఈ ఏడాది తెలంగాణలో ఎంసెట్ పరీక్షలకు మొత్తంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 94.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,05,351 మందికి 1,95,275 మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఇక ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీం ఆన్‌లైన్ పరీక్షల ప్రాథమిక కీని ఉన్నత విద్యామండలి మే 14న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ సమాధానాలు చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎంసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..