AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుష్ప 2 అల్లు అర్జున్ గెటప్‌తో గంగమ్మకు మొక్కులు.. తగ్గేదేలే..! అంటున్న ఇతను వైసీపీ ఎంపీ.. గుర్తుపట్టారా..?

అనంత వీధి‌లోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంగమ్మ సారెతో ఈ యాత్ర ప్రారంభంమైంది. అనంత వీధి నుంచి పరసాల వీధి, రామచంద్ర పుష్కరిణి, బండ్ల వీధి మీదుగా గంగమ్మ గుడికి చేరిన భక్తి చైతన్య యాత్ర లో పుష్ప-2 వేష ధారణలో గంగమ్మ కు మొక్కులు చెల్లించాడు. తప్పెటగుళ్ళు, డబ్బులు కొయ్య బొమ్మలు, కీలు గుర్రాలు, దింసా నృత్యాలు, పగటి వేషాలు బోనాల కళా ప్రదర్శనల

పుష్ప 2 అల్లు అర్జున్ గెటప్‌తో గంగమ్మకు మొక్కులు.. తగ్గేదేలే..! అంటున్న ఇతను వైసీపీ ఎంపీ.. గుర్తుపట్టారా..?
Pushpa 2 Allu Arjun Getup
Jyothi Gadda
|

Updated on: May 15, 2023 | 7:11 AM

Share

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. ఆరో రోజు వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు మాతంగి వేషం ధరించి, పొంగళ్ళు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆరవ రోజు గంగమ్మ జాతర పురష్కరించుకుని తిరుపతి ‌ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్రను ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ జాతర సందర్భంగా భక్తులు చిత్ర విచిత్ర వేషధారణలో అమ్మవారిని కొలుస్తుంటారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమా పార్ట్ 2లో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జన్ ధరించిన మాతంగి వేషధారణ అక్కడి వారందరినీ ఆకర్షించింది. పుష్ప 2 అల్లు అర్జున్‌ గెటప్‌తో అదరగొట్టిన ఈ ఎంపీ.. ఎవరో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే అతను ఎవరో కాదు.. తిరుపతి ఎంపీ గురుమూర్తి.. పుష్ప గెటప్ లో అదరగొట్టాడు. ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో జరిగిన భక్తి చైతన్య యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా గంగ జాతరలో ఎంపీ గురుమూర్తి వేషం వేసి గ్రామదేవత గంగమ్మ తల్లి పట్ల ఉన్న నమ్మకాన్ని ప్రదర్శించారు. అనంత వీధి‌లోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంగమ్మ సారెతో ఈ యాత్ర ప్రారంభంమైంది. అనంత వీధి నుంచి పరసాల వీధి, రామచంద్ర పుష్కరిణి, బండ్ల వీధి మీదుగా గంగమ్మ గుడికి చేరిన భక్తి చైతన్య యాత్ర లో పుష్ప-2 వేష ధారణలో గంగమ్మ కు మొక్కులు చెల్లించాడు. తప్పెటగుళ్ళు, డబ్బులు కొయ్య బొమ్మలు, కీలు గుర్రాలు, దింసా నృత్యాలు, పగటి వేషాలు బోనాల కళా ప్రదర్శనల మధ్యలో ఎంపీ గురుమూర్తి అభిమానులకు సెల్ఫీ ఫోజు లిచ్చారు. మాతంగి‌ వేషధారణలో ఉన్న ఎంపీ గురుమూర్తితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, తిరుపతి నగర ప్రజలు ఉత్సహాం చూపించారు. మాతంగి వేషధారణలో అనంత వీధి నుండి గంగమ్మ ఆలయం వరకూ ఎంపీ గురుమూర్తి డప్పు, మంగళ వాయిద్యాలు మధ్య నడుచుకుంటూ‌ వెళ్ళి గంగమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. ఎంపీ గురుమూర్తి వేషధారణ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ఏటా డిసెంబరు నెల వచ్చేసరికి గంగమ్మ జాతర గురించి చర్చల సందడి మొదలైపోతుంది. జాతర జరిగేది మే నెల మొదటి మంగళవారం అయినప్పటికీ…దాదాపు 4 నెలల ముందుగానే..అంటే డిసెంబరులో వచ్చే రెండో ఆదివారం అర్థరాత్రి చాటింపు వేసి తేదీలు ప్రకటించేస్తారు. ఎందుకంటే..ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా జాతర సమయానికి స్వస్థలాలకు చేరుకోవాలన్నది ఓ కారణం కాగా… వారం పాటూ వైభవంగా జరిగే జాతరకు ఏర్పాట్లు చేసుకోవాలంటే ఆమాత్రం సమయం ఉండాలి మరి. వందల సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న ఈ జాతరకు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు…ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రవాసులు కూడా భారీగా తరలివస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..