Viral Photo: ఈ బొమ్మ మీకు తెలుసా..? దీన్ని ఏమంటారో చెప్పండి..? 90లలో ఆడిన ఆటలు..
అదేవిధంగా, అప్పట్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా చాలా ప్రత్యేకమైనవి. అలాంటి ఒక బొమ్మకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు అడుగుతున్నారు..? ఈ ఫోటోలోని బొమ్మ పేరుమీకు తెలుసా ?..మీకు ఈ బొమ్మతో ముడిపడివున్న జ్ఞాపకాలను ఇక్కడ షేర్ చేయండి..

నేటి తరమంతా స్మార్ట్‌ఫోన్లతో ఆడుకునేవాళ్లే ఎక్కువ. వీరిలో ఎక్కువ సమయం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, పలు రకాల వీడియో గేమ్‌లు ఆడుతున్నావారే! తమ చేతుల్లో మొబైల్‌తో కంప్యూటర్‌ల ముందరే కూర్చుంటున్నారు. అయితే, మీరు తొంభైలలో పిల్లలు ఆడుకునే ఆటలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీకు గుర్తుండే ఉంటుంది.. అప్పట్లో లట్టు, గోళీలు, రోడ్లపై పరిగెత్తుతు ఆడుకునే టైర్ ఆటలు అనేకం ఉండేవి. అప్పట్లో పిల్లలు కాగితపు పడవలు తయారు చేసి నీటిలో వదులుతూ ఆడేవారు. క్యాసెట్‌లో పెన్ను పెట్టి టేప్ రికార్డర్‌లో ఇరుక్కున్న రీల్‌ను సరిదిద్దడంలో సంతోషించేవారు. అదేవిధంగా, అప్పట్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా చాలా ప్రత్యేకమైనవి. అలాంటి ఒక బొమ్మకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు అడుగుతున్నారు..? ఈ ఫోటోలోని బొమ్మ పేరుమీకు తెలుసా ?..
ఈ బొమ్మ పేరు మీకు తెలుసా? ఈ చిత్రాన్ని ట్విట్టర్ యూజర్ @navsekera మే 10న – దీన్ని ఏమంటారు? అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. చాలా మంది దీన్ని చూసి ఉండరు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వేగంగా షేర్ అవుతోంది. ఇప్పటికే ఈ ఫోటో వేల సంఖ్యలో వ్యూస్‌తో దూసుకుపోతుంది. అంతే పెద్ద సంఖ్యలో నెటిజన్లు లైక్ చేస్తున్నారు. అదే సమయంలో చాలా మంది వినియోగదారులందరూ దీనిని ఏమంటారో కూడా చెప్పడానికి ప్రయత్నించారు. మీకు ఈ బొమ్మతో ముడిపడివున్న జ్ఞాపకాలను మాతో పంచుకోండి..




बताइए इसको क्या कहते हैं, बहुत सारे लोगों ने देखा भी नहीं होगा ?#Throwback pic.twitter.com/ADdFj6h8OX
— Navniet Sekera (@navsekera) May 10, 2023
ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, ఒక వినియోగదారు దీనిని చట్కాన్ అని రాశారు. మరికొందరు టిక్-టిక్ అన్నారు. మరికొందరు ఇప్పుడు మేం మర్చిపోయాం అని అన్నారు! అదే సమయంలో, ముంబై, కోల్‌కతా బస్సులలో ఇప్పటికీ దీనిని చుట్పుటీ అని పిలుస్తారని ఒక వ్యక్తి చెప్పాడు. ఒకరిద్దరు కప్ప అని పిలిచేవారు. మరొక వినియోగదారు తన భావాలను వ్యక్తపరిచి వ్రాస్తుండగా – చిట్కానీ, ఇంతకుముందు ఇది 1 రూపాయికి అందుబాటులో ఉండేదని, దాన్ని కొన్న తర్వాత మేం రాజుల రుబాబ్ చూపించే వారమని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..