Telangana: సమ్మె విరమించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు.. ఫలించిన మంత్రి చర్చలు

సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీఎస్‌లను చర్చలకు పిలిచేది లేదని సీఎస్ శాంతకుమారి తెలిపారు. విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం 12 గంటల లోపు పంపాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జేపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని.. లేకుంటే సమ్మె విరమించని వారితో ఇక ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించారు.

Telangana: సమ్మె విరమించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు.. ఫలించిన మంత్రి చర్చలు
Junior Panchayat Secretarie
Follow us
Jyothi Gadda

|

Updated on: May 14, 2023 | 7:59 AM

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌లు) సమ్మె విరమించారు. సీఎం కేసీఆర్‌ తమను రెగ్యులర్‌ చేస్తారనే నమ్మకంతో సమ్మె విరమిస్తున్నట్లు జేపీఎస్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె శ్రీకాంత్‌ గౌడ్‌ తెలిపారు. ఉద్యోగులంతా తక్షణం విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సామరస్యంగానే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నెల 8వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన డెడ్‌లైన్‌లో 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా చేరాలని ఆ శాఖ వార్నింగ్ ఇచ్చింది. విధులకు హాజరుకాకపోతే వారిని టెర్మినేట్ చేస్తామని హెచ్చరించింది. కానీ, ఆ నోటీసులను బేఖాతర్ చేసిన జేపీఎస్‌లు సమ్మెను కొనసాగించారు.

జేపీఎస్‌ల సమ్మెను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీఎస్‌లను చర్చలకు పిలిచేది లేదని సీఎస్ శాంతకుమారి తెలిపారు. విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం 12 గంటల లోపు పంపాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జేపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని.. లేకుంటే సమ్మె విరమించని వారితో ఇక ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించారు. దీనికి ప్రత్యామ్నాయంగా స్థానికంగా ఉంటున్న గ్రాడ్యుయేట్లను కొన్ని షరతులకు లోబడి తాత్కాలిక పద్ధతిలో జేపీస్‌లుగా నియమించుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లితో చర్చలు జరిపిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన జేపీఎస్‌లు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..