Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mixer Jar Repair At Home: మిక్సర్ జార్ బ్లేడ్లు ఎందుకు జామ్ అవుతాయి..? ఇలా చేస్తే ఇంట్లోనే సమస్యకు పరిష్కారం..!

అయితే, మిక్సర్‌లలో జార్ బ్లేడ్‌ల జామింగ్ అనేది ఒక సాధారణ సమస్య. అయితే, జార్‌ లేకుండా మిక్సర్ అసలే పనికిరాకుండా పోతుంది. కొన్నిసార్లు ఏదైనా గ్రైండ్ చేసేటప్పుడు జార్‌ జామ్‌ కావటం జరుగుతుంది. ఈ సమస్య ప్రతి ఇంట్లో ఎదురయ్యేదే. అందుకే దీన్ని ఇంట్లోనే ఎలా రిపేర్‌ చేసుకోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Mixer Jar Repair At Home: మిక్సర్ జార్ బ్లేడ్లు ఎందుకు జామ్ అవుతాయి..? ఇలా చేస్తే ఇంట్లోనే సమస్యకు పరిష్కారం..!
Mixer Blade
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2023 | 1:31 PM

వంట పనిని ఈజీగా మార్చేందుకు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. మిక్సర్ గ్రైండర్ ఇందులో ముఖ్యమైన పరికరాలలో ఒకటి. ఇది దాదాపు ప్రతి వంటగదిలో ఉంటుంది.. నేటి కాలంలో అది లేకుండా వంట చేయడం ఊహించడం కష్టం. అయితే, మిక్సర్‌లలో జార్ బ్లేడ్‌ల జామింగ్ అనేది ఒక సాధారణ సమస్య. అయితే, జార్‌ లేకుండా మిక్సర్ అసలే పనికిరాకుండా పోతుంది. కొన్నిసార్లు ఏదైనా గ్రైండ్ చేసేటప్పుడు జార్‌ జామ్‌ కావటం జరుగుతుంది. ఈ సమస్య ప్రతి ఇంట్లో ఎదురయ్యేదే. అందుకే దీన్ని ఇంట్లోనే ఎలా రిపేర్‌ చేసుకోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మిక్సర్ బ్లేడ్ తిరగకుండా ఉండటానికి అత్యంత సాధారణ కారణం దాని బ్లెడ్‌లు టైట్‌గా మారటం. నీరు, లవణాలు, ఇతర ద్రవాలు దానిలోకి చేరడంతో బ్లెడ్స్‌ టైట్‌గా మారిపోతాయి. దీని వలన బ్లేడ్లు జామ్ అవుతాయి. తిరగవు. దీని కారణంగా మిక్సి కూడా నిరుపయోగంగా మారుతుంది.. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. జామ్డ్ మిక్సర్ జార్‌ను ఫ్రీ చేయడానికి ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు సూచించబడ్డాయి. వాటిని అనుసరించి మీ ఇంట్లో జామ్‌ అయిన జార్లను ఈజీగా తిరిగేలా చేసుకోండి.

బ్లేడ్ జామ్ అయినట్లయితే దానిని చేతితో వ్యతిరేక దిశలో తిప్పడానికి ప్రయత్నించండి. దీంతో బ్లేడ్‌లు వదులుగా మారకపోతే, కొన్ని చుక్కల కొబ్బరి లేదా ఆవాల నూనె వేసి ఇప్పుడు మళ్లీ బ్లేడ్‌లను చేతితో తిప్పండి. అలాడే ఆ జార్‌ను సుమారు 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఆ తర్వాత దానిని మిక్సికి పెట్టి ఒకసారి ట్రై చేసి చూడండి..అప్పుడు జార్‌ ఈజీగా, ఎటువంటి సమస్య, అవాంతరాలు లేకుండా రయ్‌మంటూ తిరుగుతుంది. దీంతో మీ సమస్య తీరిపోయినట్టే.

మిక్సర్ బ్లేడ్ తిరగకపోవడానికి మరొక కారణం విరిగిన మోటారు కప్లర్ లేదా వంకర జార్ బ్లేడ్. ఇది ఓవర్‌లోడింగ్, కాంపోనెంట్‌ల నాణ్యత తక్కువగా ఉండటం, వాటి అరిగిపోవడం వల్ల కావచ్చు. కప్లర్, బ్లేడ్ దెబ్బతినడం వల్ల మిక్సీ జార్ జామ్ అయితే, దాన్ని సరిచేయడానికి ఏకైక మార్గం కప్లర్, బ్లేడ్‌లను మార్చడం. మీరు దీన్ని సాధారణంగా మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. కావాలంటే స్క్రూ డ్రైవర్‌తో ఇంట్లోనే మార్చుకోవచ్చు. లేదంటే ఏ రిపేర్‌ షాపులో అడిగినా సరే తక్కువ ధరలోనే సరిచేసి ఇస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..