AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు బంగారు నగలు కొనాలనుకుంటున్నారా..? తిరిగి తాక‌ట్టు పెట్టే ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే ..

దుకాణాల్లో కొన్న నగలు కొన్ని కొన్ని సందర్భాల్లో దొంగిలించిన నగలు కూడా కావొచ్చు. అలాంటి బంగారు నగాల్లో మనకు తెలియని ఎన్నో దోషాలు దాగి ఉంటాయి. ఈ ఆభరణాలు మనం కొన్నప్పుడు అవి మన ఇంట్లో ఉండవు. కుటుంబంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు..

మీరు బంగారు నగలు కొనాలనుకుంటున్నారా..? తిరిగి తాక‌ట్టు పెట్టే ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే ..
Gold Price
Jyothi Gadda
|

Updated on: May 12, 2023 | 11:40 AM

Share

జ్యోతిశాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించబడ్డాయి. అందులో భాగంగా మనం ధరించే బంగారం కూడా ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం.. మనకు దోశం ఉంటేనే బంగారం మన దగ్గర ఉండదని చెబుతారు. దానికి పరిహారాలు చేస్తే ఆటోమేటిక్‌గా బంగారం కొనే యోగం మనకు వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, మన ఇంట్లో బంగారం పేరుకుపోకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. అందులో స్వర్ణ దోషం ఒకటి. ఈ దోషాన్ని సరిగ్గా సరిచేయకపోతే బంగారం మీ ఇంట్లో నిలువదు. మీరు నగలు కొనుగోలు చేసినప్పుడల్లా అది పోగొట్టుకునే, తాకట్టు దుకాణానికి వెళ్లే అవకాశం ఉంది. మీరు స్వర్ణ దోషంతో ఇబ్బంది పడుతున్నట్టయితే.. ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం.

నగల దుకాణంలో ఎవరి నగలు కొంటామో మనకు తెలియదు. బహుశా ఆ నగలు చనిపోయిన వారివి కావచ్చు లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మేసుకున్నవారికి కూడా కావొచ్చు. దుకాణాల్లో కొన్న నగలు కొన్ని కొన్ని సందర్భాల్లో దొంగిలించిన నగలు కూడా కావొచ్చు. అలాంటి బంగారు నగాల్లో మనకు తెలియని ఎన్నో దోషాలు దాగి ఉంటాయి. ఈ ఆభరణాలు మనం కొన్నప్పుడు అవి మన ఇంట్లో ఉండవు. కుటుంబంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు స్వర్ణ దోశం తొలగిపోయి, బంగారు యోగం కలగాలంటే జ్యోతిశాస్త్రం ప్రకారం ఇలాంటి నియమాలను తప్పనిసిరిగా పాటించాల్సి ఉంటుంది.

మనం బంగారం కొన్నప్పుడు ఇంటికి వచ్చి వెంటనే బీరువాలో పెట్టకూడదు. ఈ ఆభరణాలను పనీర్ కలిపిన నీటితో శుభ్రం చేసి, బాగా తుడిచిన తర్వాత, వాటిని మల్లెపూలు నింపిన ప్లేట్‌లో ఉంచాలి. ఇంటి పూజా గదిలో లక్ష్మీ దేవి ముందు పెట్టాలి. దీపం వెలిగించాలి. భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించిన తరువాత, మీరు మీ నగలు ఉపయోగిస్తే బంగారం పెరుగుతుంది. స్వర్ణ దోషం తొలగిపోతుంది. ఈ పరిహారం శుక్రవారాల్లో చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయండి. దీనితో పాటు తామరపూవు, పారిజాత వంటి పూలతో పూజించాలి. ఈ నీటిపై మీ చేతులను ఉంచి, మీ మనస్సులో మీకు ఇష్టమైన దేవతలను(స్వర్ణదేవత) ప్రార్థించండి. ఆ తర్వాత ఇంట్లో బంగారం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. దీని తరువాత మీరు నగలను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. మీరు డబ్బు దాచుకునే చోట అద్దం పెట్టడం మర్చిపోవద్దు. కొన్ని ఇళ్లు తమ డబ్బును బీరువాలోని లాకర్‌లో పెడుతుంటారు. అక్కడ అద్దం ఉంటే డబ్బు పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).