AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటికి చలువ చేసే కీరదోసకాయ.. తొక్క తీయకుండానే తింటున్నారా..? వేరీ డేంజర్‌ సుమా..!

దోసకాయలో ఉండే బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న దోసకాయను తొక్క తీయకుండా తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..కీరదోసకాయ తొక్క

ఒంటికి చలువ చేసే కీరదోసకాయ.. తొక్క తీయకుండానే తింటున్నారా..? వేరీ డేంజర్‌ సుమా..!
Cucumber
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2023 | 10:47 AM

వేసవిలో శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.. నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినడం అలవాటు చేసుకోండి. క్రమం తప్పకుండా నీరు, నిమ్మరసం తాగాలి. వేసవిలో తరచుగా దోసకాయ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యం, శరీరాన్ని చల్లబరుస్తుంది వంటి అనేక ప్రయోజనాల కోసం దోసకాయను ఉపయోగించవచ్చు. వేసవిలో దోసకాయ మనకు దొరికిన గొప్ప వరంలాంటిది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయలో 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉండదు. అయితే దోసకాయ పొట్టు తీయకుండా తింటే ఏమవుతుందో తెలుసా?

కీర దోసకాయలలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీరదోసకాయలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన శరీరంలో రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కె చాలా అవసరం.

కీరదోసకాయలో ఉండే లిగ్నన్‌లకు బోలు ఎముకల వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్‌ను నివారించే శక్తి ఉంది. దోసకాయలో ఉండే బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న దోసకాయను తొక్క తీయకుండా తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..కీరదోసకాయ తొక్క తీసేసి తినడం మంచిదని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ, చాలా మంది దోసకాయను చర్మంతో కలిపి తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. ఎందుకంటే పూర్వ కాలంలో పంట ఉత్పత్తులపై పురుగుమందుల పిచికారీ తక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు దిగుబడిని పెంచేందుకు ఆహార పంటలపై రసాయనాలు ఎక్కువగా చల్లడం పరిపాటి. తొక్క తీయకుండా రసాయనాలు స్ప్రే చేసిన దోసకాయలను తినడం వల్ల శరీరానికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుతీసేసి తినడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..