Sajjala: బాబు పల్లకీ మోయడమే పవన్‌ కళ్యాణ్‌ అజెండా.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపడతామని ప్రకటించారు. ఇక, ముఖ్యమంత్రి కావాలనుకుంటే అయిపోరని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీనో, బీజేపీనో అడగబోనని.. నా సత్తా ఏంటో చూపించి అడుగుతానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Follow us
Jyothi Gadda

| Edited By: Janardhan Veluru

Updated on: May 12, 2023 | 11:57 AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పొత్తుల ప్రకటనపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పవన్‌ మనసులో ఏముందో బట్టబయలైందంటూ ఘాటుగా విమర్శించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాపాడుకోవటమే తన నిర్ణయమంటూ.. పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. తనకు వామపక్షాలతో కలిసి పోరాటం చేయాలని ఉందంటూ స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ ఇమేజ్ నీటి బుడగ లాంటిది అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ కళ్యాణ్ పనిగా పెట్టుకున్నారని, తనకు బలం లేదని పవన్ అంగీకరించారంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని పవన్, చంద్రబాబు అంటున్నారు. ఆ మాట ప్రజలు అనడంలేదు. పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు కలలే పవన్ కల్యాణ్ కలలు,చంద్రబాబు ఊహలే పవన్ ఊహలు అన్నట్టుగా ఉందన్నారు. దుష్ట శక్తులన్నీ ఏకం అవుతున్నాయని జగన్ ముందే చెప్పారు. ఇప్పుడదే జరుగుతోందని సజ్జల వ్యాఖ్యనించారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఫ్యాన్స్ కన్న కలలను చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే పార్టీలన్నీ కలవాలని కోరుకుంటున్నామని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తమను కనీసం 40 స్థానాల్లో గెలిపించి ఉండాల్సి ఉందన్నారు. జనసేన పార్టీకి ప్రజలు కనీసం 30- 40 ఎమ్మెల్యేలు స్థానాలు ఇచ్చి ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటామని అడగగలమని అన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపడతామని ప్రకటించారు. ఇక, ముఖ్యమంత్రి కావాలనుకుంటే అయిపోరని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీనో, బీజేపీనో అడగబోనని.. నా సత్తా ఏంటో చూపించి అడుగుతానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..