రూటు మార్చిన స్మగ్లర్లు..! రోడ్డు మార్గంలో కూడా బంగారం అక్రమ రవాణా.. భారీగా పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టును అయితే స్మగ్లింగ్ డెన్ అని అంటారు. రోజు బంగారం పట్టుబడుతూనే ఉన్నారు. గతంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో బంగారం దొరికింది. ఇప్పుడు రోడ్డు మార్గంలో కూడా బంగారం అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా బయటపడింది.

రూటు మార్చిన స్మగ్లర్లు..! రోడ్డు మార్గంలో కూడా బంగారం అక్రమ రవాణా.. భారీగా పట్టివేత
Huge Gold
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2023 | 7:16 AM

విజయవాడ కస్టమ్స్ అధికారులు బంగారం స్మగ్లింగ్‌ ముఠా గుట్టు రట్టు చేశారు. భారీగా బంగారం పట్టుకున్నారు. కాజా టోల్ ప్లాజా, బొల్లాపల్లి టోల్ ప్లాజాల వద్ద కారులో, ప్రైవేట్ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న 13 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 8 కోట్లు. బంగారం స్మగ్లింగ్‌పై నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో టోల్‌ప్లాజాల వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేయగా అక్రమంగా రవాణా చేస్తున్న విదేశీ బంగారం పట్టుబడింది. బంగారాన్ని తీసుకు వెళుతున్న నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు విజయవాడ కస్టమ్స్‌ కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి జ్యుడిషియల్‌ రిమాండ్ విధించింది.

విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా అవుతుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టును అయితే స్మగ్లింగ్ డెన్ అని అంటారు. రోజు బంగారం పట్టుబడుతూనే ఉన్నారు. గతంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో బంగారం దొరికింది. ఇప్పుడు రోడ్డు మార్గంలో కూడా బంగారం అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..