RGV on Pawan Kalyan: ఫ్యాన్స్‌కు, జనసైనికులకు జనసేనాని షాక్.. వర్మ ప్రగాఢ సానుభూతి

ఎవరు అవునన్నా, కాదన్నా.. ఏపీ రాజకీయాల్లో కాపుల రిప్రజంటేటర్‌ పవన్‌ కల్యాణ్‌. ఎప్పటికైనా తమవర్గం నేత ముఖ్యమంత్రి అవుతారన్న ఆశతో ఉన్న కాపుల్లో పవన్‌పై మెజార్టీ శాతం ఆశలు పెట్టుకున్నారు. అయితే, తాజా ప్రకటనతో సొంత సామాజికవర్గం.. పవన్‌కు దూరమవుతుందనే చర్చ మొదలైంది.

RGV on Pawan Kalyan: ఫ్యాన్స్‌కు, జనసైనికులకు జనసేనాని షాక్.. వర్మ ప్రగాఢ సానుభూతి
Rgv On Pawan
Follow us
Surya Kala

|

Updated on: May 12, 2023 | 6:43 AM

ఏపీలో జనసేన సొంతంగా పోటీచేయలేదా? పొత్తులుంటే తప్ప బరిలో నిలవలేదా? అసలు, పవన్‌ కల్యాణ్‌కు సీఎం అయ్యేంత బలం లేదా? ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదా? తాజాగా, జనసేన అధినేత చేసిన కామెంట్స్‌తో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇంతకీ ఆయనేమన్నారు? దాని పర్యావసానాలు ఎలా ఉండబోతున్నాయి? అని అందరిలోనూ ఆసక్తి..

ఈశ్వరా.. పవనేశ్వరా.. అంటూ తమ అభిమాన నాయకుణ్ని కొలుచుకునే అభిమానులకు…పెద్ద షాకిచ్చారు పవన్‌ కల్యాణ్‌. తమ బాసును వీలైనంత తొందర్లో సీఎం కుర్సీలో చూడాలనుకుంటున్న జనసైనికులనూ నిరాశపర్చారు. అవును… ఇప్పుడీ ఒక్క మాట… జనసేనలోనే కాదు, ఏపీ రాజకీయాల్లోనూ పెద్దచర్చకు దారితీసింది. ఇన్నాళ్లూ సీఎం సీఎం అంటూ అభిమానులు అరుస్తుంటే.. సరదాగా వారిస్తూ వస్తున్న పవన్‌… ఇప్పుడు తుస్సున గాలి తీసేశారు. సీఎం పదవిని డిమాండ్‌ చేసేంత సినిమా మనకు లేదంటూ… క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఎవరు అవునన్నా, కాదన్నా.. ఏపీ రాజకీయాల్లో కాపుల రిప్రజంటేటర్‌ పవన్‌ కల్యాణ్‌. ఎప్పటికైనా తమవర్గం నేత ముఖ్యమంత్రి అవుతారన్న ఆశతో ఉన్న కాపుల్లో పవన్‌పై మెజార్టీ శాతం ఆశలు పెట్టుకున్నారు. అయితే, తాజా ప్రకటనతో సొంత సామాజికవర్గం.. పవన్‌కు దూరమవుతుందనే చర్చ మొదలైంది. పవన్‌ కోసం ఎంత చేసినా.. ఇతరులకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే యాంగిల్‌లో… అధికార వైసీపీ అప్పుడే కౌంటర్లు విసురుతోంది. కాపుల్ని పవన్‌ మోసం చేశారంటూ దుమ్మెత్తిపోస్తోంది.

ఇదే అంశంపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన రాంగోపాల్‌ వర్మ… తనదైన స్టయిల్‌లో సెటైర్లు వేశారు. కాపుల్ని, అభిమానుల్ని దారుణంగా వెన్నుపోటు పొడిచారంటూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అటు, పొత్తుల విషయంలోనూ పవన్‌ క్లారిటీ ఇచ్చారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా… కచ్చితంగా పొత్తుల కోసం ప్రయత్నాలు ఉంటాయనీ, అందర్నీ కలుపుకెళ్తాననీ చెప్పారు.

పొత్తులు లేకుండా ముందుకు వెళ్లలేమంటూ పవన్‌ చెప్పడంతోనే… ప్రతిపక్షాల ఓటమి, మరోమారు జగన్ విజయం ఖాయమైపోయాయంటున్నారు అధికారపక్షం నేతలు. బీజేపీతో ఉంటారా? టీడీపీతో కలుస్తారా? కమ్యూనిస్టులతో వెళ్తారా? తేల్చుకోవాలంటూ పవన్‌కు సవాల్‌ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.

సో.. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో… జనసేనకు సంబంధించి జనాల్లో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. పవన్‌ ఈసారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాబోవడం లేదన్నది సుస్పష్టం. మరి, అందర్నీ కలుపుకెళ్తానంటున్న పవన్‌.. ఎవరితో చేయి కలుపుతారన్నదే ఆసక్తికర అంశం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..