Vijayawada: విజయవాడలో నేటి నుంచి 6 రోజుల పాటు మహాయజ్ఞం.. యజ్ఞ క్రతువును ప్రారంభించనున్న సీఎం

ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత, శ్రీలక్ష్మీ మహాయజ్ఞం చేస్తున్నారు. మహా యజ్ఞానికి సంకల్పం చెప్పేందుకు జగన్ ఇవాళ విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియానికి వస్తున్నారు. ఉదయం 8.30 కు యజ్ఞ క్రతువును సీఎం జగన్ ప్రారంభిస్తారు.

Vijayawada: విజయవాడలో నేటి నుంచి 6 రోజుల పాటు మహాయజ్ఞం.. యజ్ఞ క్రతువును ప్రారంభించనున్న సీఎం
Maha Yagnam In Vijayawada
Follow us

|

Updated on: May 12, 2023 | 7:24 AM

ఏపీలో ఆరు రోజులపాటు ఎప్పుడూ చేయని అతిపెద్ద కార్యక్రమం దేవాదాయ శాఖ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహా యజ్ఞం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు. ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత, శ్రీలక్ష్మీ మహాయజ్ఞం చేస్తున్నారు. మహా యజ్ఞానికి సంకల్పం చెప్పేందుకు జగన్ ఇవాళ విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియానికి వస్తున్నారు. ఉదయం 8.30 కు యజ్ఞ క్రతువును సీఎం జగన్ ప్రారంభిస్తారు. 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో దేవాదాయశాఖ ఈ యాగాన్ని నిర్వహిస్తోంది.

ఇవాళ్టి నుండి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యజ్ఞం జరగనుంది. సాయంత్రం ఆరు గంటల నుండి స్తోత్రపారాయణాలు, ప్రవచనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయాలకు చెందిన దేవతామూర్తుల కల్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగియనుంది. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు.

రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే రాజశ్యామల యాగానికి ఒక్కో రోజు ఒక్కో పీఠాధిపతిని ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 450 మంది రుత్వికులు ఈ యాగంలో పాల్గొంటారని కొట్టు సత్యనారాయణ చెప్పారు. రాజశ్యామల యాగానికి వచ్చే వారికి రెండు పూటలా ప్రసాదంతో పాటు నీరు, మజ్జిగ అందజేస్తామని వెల్లడించారు. ఎండాకాలంలో జరుగుతున్న ఈ యాగానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..