Nellore: కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉద్రిక్తత.. భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపణ
నెల్లూరు నగరంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, టెంపుల్ ఛైర్మెన్ ముక్కాల ద్వారకానాథ్ అవినీతికి పాల్పడ్డారని టీడీపీ వాణిజ్య విభాగం నేతలు ఆరోపించారు.
సవాళ్లు, ప్రతి సవాళ్లకు వేదికగా మారింది నెల్లూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. ఆలయ లెక్కల్లో అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపించగా.. అవాస్తవమని ఖండించింది పాలకవర్గం. రెండు వర్గాల మధ్య ఆలయంలోనే వాగ్వాదం జరిగింది. నెల్లూరు నగరంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, టెంపుల్ ఛైర్మెన్ ముక్కాల ద్వారకానాథ్ అవినీతికి పాల్పడ్డారని టీడీపీ వాణిజ్య విభాగం నేతలు ఆరోపించారు. దాతల నుంచి 12కోట్లు వసూలు చేసి.. వాటిలో ఐదున్నర కోట్లకు లెక్కలు చెప్పడంలేదన్నారు టీడీపీ నేతలు.
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, పూర్తి పారదర్శకంగా అమ్మవారి ఆలయాన్ని పునర్ నిర్మించామని ముక్కాల ద్వారకానాథ్ స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో పైసా దుర్వినియోగం కాలేదంటూ ఆలయంలోకి వెళ్లి ప్రమాణం చేశారు.
ఇక.. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్యే.. ముక్కాల ద్వారకానాథ్‌తోపాటూ ఆయన మద్దతుదారులు, టీడీపీ నేతలు ఒకేసారి ఆలయానికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. విషయాన్ని ముందే పసిగట్టిన పోలీసులు.. టీడీపీ నేతలను అక్కడినుంచి పంపించారు. అయితే.. ప్రమాణం చేయమంటే టీడీపీ నేతలు పారిపోయారని నుడా చైర్మన్ విమర్శించగా.. లెక్కలు అడిగితే ప్రమాణం చేయడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..