CM Jagan: అకాలవర్షాలతో తడిచిన ధాన్యం.. అన్నదాతకు అండగా సీఎం జగన్.. ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ప్రభుత్వం అలర్టైంది. ధాన్యం ఎక్కడ ఉన్న వెంటనే సేకరించండి. వెంటనే తడిసిన పంటను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం జగన్.
వేసవి కాలంలో వర్షాకాలాన్ని తలపిస్తూ కురుస్తున్న వర్షాలతో అన్నదాత కంట కన్నీరు పెడుతున్నాడు. చేతికి అందివచ్చిన పంట నీటిలో తేలుతుదండంతో ప్రకృతి తమని కరుణించదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్న వేడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ అలెర్ట్ అయింది. అన్నదాతను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. చర్యలు తీసుకోవడం సీఎం జగన్ ప్రారంభించారు.
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ప్రభుత్వం అలర్టైంది. అకాల వర్షాలపై కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టం పరిస్థితులపై సీఎం సమీక్ష చేపట్టారు. విశాఖపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తిరిగి రాగానే సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు సీఎం. అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్ద నుంచి వెంటనే ఈ ధాన్యాన్ని సేకరించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే హార్వెస్టింగ్ చేసి ధాన్యం ఎక్కడా ఉన్నా సేకరించాలని ఆదేశించారు. వర్షాల బారి నుంచి పంటను కాపాడేందుకు చర్యలను మరింత ముమ్మరంగా చేయలన్నారు.
కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద కాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చులకింద ప్రతి కలెక్టర్‌కూ ఒక కోటి రూపాయలు కేటాయించారు. అలాగే ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. వర్షాలు తగ్గగానే పంట నష్టపోయిన చోట రైతులకు అండగా నిలవాలని విత్తనాలు పంపిణీచేయాలని సీఎం ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..