మళ్లీ తెరపైకి వచ్చిన అయేషామీరా హత్య కేసు.. హాస్టల్ వార్డెన్‌ను పిలిచిన సీబీఐ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సిబీఐ కేంద్రంగా జరుగుతోంది. గతంలో సత్యం బాబును నిర్దోషిగా తేల్చడంతో అయేషా తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సిబీఐ కేంద్రంగా జరుగుతోంది. గతంలో సత్యం బాబును నిర్దోషిగా తేల్చడంతో అయేషా తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. దీంతో ఆ కేసును విచారించాలంటూ కోర్టు సీబీఐకి ఆదేశించింది. అయితే తాజాగా మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ ఆయేషా మీరా ఉన్న హాస్టల్వార్డెన్ను పిలిచింది. విచారణ జరిగిన తర్వాత వార్డెన్ సీబీఐ కార్యాలయం నుంచి వెళ్లి పోయారు.
2007 డిసెంబర్ 27 వ తారీఖున విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషామీరాను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోలీసులపై తీవ్ర ఒత్తిడి రావడంతో సత్యంబాబును అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం దిగువ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించగా.. 2017లో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు నిందితులను తేల్చే పనిలో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..