Health Tips: ప్రోటీన్ ఫుడ్‌ ఎక్కువగా తింటే ఎన్ని అనర్థాలో తెలుసా..? ప్రాణాలకే ముప్పు..!

ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో ఏదో ఒక రూపంలో ప్రోటీన్లను తీసుకుంటారు. అయితే ప్రోటీన్లను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? కొన్నిసార్లు ప్రోటీన్‌తో కూడిన శ్యాచురేటెడ్ కొవ్వు మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

Health Tips: ప్రోటీన్ ఫుడ్‌ ఎక్కువగా తింటే ఎన్ని అనర్థాలో తెలుసా..? ప్రాణాలకే ముప్పు..!
Follow us
Jyothi Gadda

|

Updated on: May 11, 2023 | 12:49 PM

ప్రోటీన్లు మన శరీరానికి ఎంతో అవసరం. ఎందుకంటే ఇవే మనల్ని ఎన్నో రోగాల ముప్పు నుంచి తప్పిస్తాయి. పాల ఉత్పత్తులు, మాంసాలు, గుడ్లు, కాయధాన్యాలు, కూరగాయల్లో ప్రోటీన్లు ఉంటాయి. చాలామంది ప్రతిరోజూ గుడ్లు, చేపలు, మాంసం తినడానికి ఇష్టపడతారు. వీటిలో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో ఏదో ఒక రూపంలో ప్రోటీన్లను తీసుకుంటారు. అయితే ప్రోటీన్లను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మూత్ర పిండాలు దెబ్బతింటాయని కొంతమంది అంటూ ఉంటారు. మరి అవసరమైన దాని కన్నా ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

అధిక ప్రోటీన్ శరీరానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, అధిక ప్రోటీన్‌ బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణంగా మారుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు పేరుకుపోతాయి. ఈ కేలరీలు కొవ్వుగా మారి శరీర బరువును పెంచుతాయి. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదనపు ప్రోటీన్‌ను మూత్రపిండాలు సులభంగా ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రోటీన్‌తో కూడిన శ్యాచురేటెడ్ కొవ్వు మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

అధిక ప్రొటీన్ తినడం వల్ల కాల్షియంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. అధిక ప్రోటీన్ శరీరంలోని కాల్షియంను తగ్గిస్తుంది. ఫలితంగా ఎముక బలహీనంగా మారుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల నోటి దుర్వాసన కూడా వస్తుంది. ప్రొటీన్ ఎక్కువగా తినడం వల్ల ప్రోటీన్ ఆర్గానిక్ పదార్థం నోటిలో పేరుకుపోతుంది. ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్యసంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ