దేశంలోనే అత్యంత ఖరీదైన వీధుల జాబితాలో హైదరాబాద్..! టాప్ 2లో సోమాజిగూడ..
మొదటి ఎనిమిది మార్కెట్‌లలోని 30 హై స్ట్రీట్‌ల కోసం ఈ అధ్యయనం నిర్వహించబడింది. దీని ప్రకారం..యాక్సెస్, పార్కింగ్, షాపులు వంటి పారామీటర్ల ఆధారంగా ఈ వీధులకు ర్యాంకులు ఇచ్చారు. నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లోని ప్రముఖ హై వీధుల్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్‌పేట్, గచ్చిబౌలి ఉన్నాయి.
మనదేశంలోనే అత్యంత ఖరీదైన వీధుల్లో (హై స్ట్రీట్స్) హైదరాబాద్‌లోని సోమాజిగూడ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బెంగళూరులోని ఎంజీ రోడ్ ఉంది. సోమాజీగూడలో ఒక చదరపు అడుగుకు నెలకు రూ.150–175 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ముంబై లింకింగ్ రోడ్, ఢిల్లీ సౌత్ ఎక్స్‌టెన్షన్ పార్ట్ I & పార్ట్ II, కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్, కామాక్ స్ట్రీట్, చెన్నై అన్నా నగర్, బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, నోయిడా సెక్టార్ 18 మార్కెట్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్, బెంగళూరు చర్చి స్ట్రీట్ మిగతా స్థానాల్లో ఉన్నాయి. మొత్తం పది మార్కెట్ లొకేషన్లలో నాలుగు బెంగళూరులోనే ఉండటం గమనార్హం.
సర్వే జరిపిన 30 హై స్ట్రీట్లలో అత్యధికంగా దుస్తుల స్టోర్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పది వీధుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని నైట్‌ఫ్రాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. మనదేశంలో జరుగుతున్న రిటైల్ లావాదేవీల్లో 24 శాతం వాటా ఎన్సీఆర్ మార్కెట్నుంచే ఉంది. ఢిల్లీ ఖాన్‌మార్కెట్, డీఎల్ఎఫ్ గలేరియా, ముంబై లింకింగ్ రోడ్, టర్నర్ రోడ్లో అత్యధికంగా అద్దెలు వసూలు చేస్తున్నారు. నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లోని ప్రముఖ హై వీధుల్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్‌పేట్, గచ్చిబౌలి ఉన్నాయి.
నివేదిక ప్రకారం..భారతదేశంలోని హై స్ట్రీట్ల జాబితాలో ఎంజి రోడ్ (బెంగళూరు) అగ్రస్థానంలో ఉంది, రెండవ స్థానంలో సోమాజిగూడ (హైదరాబాద్), లింకింగ్ రోడ్ (ముంబై), మరియు సౌత్ ఎక్స్‌టెన్షన్ (ఢిల్లీ) ఉన్నాయి. దేశంలోని టాప్ 10 హై స్ట్రీట్లలో కూడా జాబితా చేయబడింది. ఈ ర్యాంకింగ్ అధ్యయనం నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్లాగ్‌షిప్ వార్షిక రిటైల్ నివేదిక ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2023 – హై స్ట్రీట్ రియల్ ఎస్టేట్ ఔట్‌లుక్’లో ఫిజిటల్ రిటైల్ కన్వెన్షన్ 2023తో అనుబంధంగా ఉంది. ఈ నివేదిక మే 11, 2023న జరిగే గాలా ఈవెంట్‌లో అధికారికంగా ప్రారంభించారు. మొదటి ఎనిమిది మార్కెట్‌లలోని 30 హై స్ట్రీట్‌ల కోసం ఈ అధ్యయనం నిర్వహించబడింది. దీని ప్రకారం..యాక్సెస్, పార్కింగ్, షాపులు వంటి పారామీటర్ల ఆధారంగా ఈ వీధులకు ర్యాంకులు ఇచ్చారు.
ఇకపోతే, Y 2023–24లో మాల్స్ కంటే హై స్ట్రీట్‌ల సగటు ప్రతి చదరపు మీటరు ఆదాయాలు గణనీయంగా ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. రాబోవు రోజుల్లో ఇతర రిటైల్ ఫార్మాట్‌లు వృద్ధి చెందుతున్నప్పటికీ, హై స్ట్రీట్‌లు కస్టమర్‌లకు మంచి రిటైలింగ్ అనుభవాన్ని అందిస్తాయని నివేదిక వెల్లడించింది. నగరంలో అధిక డిమాండ్ ఉన్నందున రియల్ ఎస్టేట్ డెవలపర్లు వాణిజ్య స్థలాలను నిర్మించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..