AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

watch: అయ్య బాబోయ్‌.. అంతపెద్ద కింగ్‌కోబ్రాను అలా ఎలా పట్టేశావ్‌ గురూ..! ఈ వీడియో చూస్తే హడలే..

కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా సార్లు.. టాయిలెట్ సీటు లోపల, కారులో, ఇంట్లో ఏ మూలన పాములు కనిపిస్తుంటాయి.. దాంతో ఆ పామును తప్పించేందుకు ప్రజలు చాలా భయపడిపోవాల్సి వస్తుంది. అందుకోసం స్నేక్‌ క్యాచర్ సాయంతో పాములు పట్టిస్తుంటారు. ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

watch: అయ్య బాబోయ్‌.. అంతపెద్ద కింగ్‌కోబ్రాను అలా ఎలా పట్టేశావ్‌ గురూ..! ఈ వీడియో చూస్తే హడలే..
King Cobra
Jyothi Gadda
|

Updated on: May 11, 2023 | 9:04 AM

Share

పాములంటే అందరికీ హడలే..! అంతదూరంలో పాముందని తెలిస్తే చాలు.. భయంతో పరుగులు పెడుతుంటారు చాలా మంది. ఎందుకంటే కొన్ని పాములు చాలా విషపూరితమైనవి. అది కాటేస్తే బతికే అవకాశం ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలో పాములు ఎక్కువగా భయపెడుతుంటాయి. తరచూ ఇళ్ల మధ్యలోకి వచ్చే పాములు ప్రజల్ని కాటువేసి చంపేస్తుంటాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా సార్లు.. టాయిలెట్ సీటు లోపల, కారులో, ఇంట్లో ఏ మూలన పాములు కనిపిస్తుంటాయి.. దాంతో ఆ పామును తప్పించేందుకు ప్రజలు చాలా భయపడిపోవాల్సి వస్తుంది. అందుకోసం స్నేక్‌ క్యాచర్ సాయంతో పాములు పట్టిస్తుంటారు. ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. 15 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా రెస్క్యూ వీడియో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.  ఈ వీడియో చూస్తే మీకు గూస్‌బంప్స్ ఇస్తుంది.

ఈ వీడియో విదేశాలకు చెందినదని ప్రచారం జరుగుతోంది. కానీ, ఎక్కడ్నుంచి అన్నది మాత్రం ఎలాంటి సమాచారం దొరకలేదు. ఓ ఇంటి ఆవరణలో నాగుపామును చూసిన వెంటనే ఆ ఇంట్లోని వారు రెస్క్యూ టీమ్‌కి సమాచారం అందించారు. ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తి అక్కడికి చేరుకుని అతి కష్టం మీదను పామును పట్టేశాడు. దాని కోసం అతడు ఒక టెక్నిక్ ఉపయోగించాడు. పాము నేలపై పాకుతున్నప్పుడు దాన్ని అతడు పట్టుకోవటానికి ప్రయత్నించాడు. దాంతో ఆ నాగుపాము చాలా కోపంగా బుసలు కొడుతుంది.. వేగంగా కదులుతూ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. చాకచక్యంగా వ్యవహరించిన స్నేక్‌క్యాచర్‌ తనను తాను రక్షించుకుంటూ, దాన్ని ఒక సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని సురక్షితమైన అడవిలో వదిలేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ క్లిప్‌ను IFS సుశాంత్ నందా (@susantananda3) ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అతను క్యాప్షన్‌లో ఇలా రాశాడు – ప్రకృతిలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఆహార గొలుసులో కింగ్ కోబ్రాస్ ముఖ్యమైనవి. దాదాపు 15 అడుగుల పొడవైన నాగుపామును ఇక్కడ రక్షించారు. శిక్షణ పొందిన స్నాక్ క్యాచర్ ద్వారా ఈ మొత్తం ఆపరేషన్ జరుగుతుంది. అందువల్ల, ఇలాంటి పద్ధతిని ఎవరూ ప్రయత్నించవద్దు. వర్షాలు రావడంతో ఇలాంటి ప్రాంతాల్లో నాగుపాములు కనిపించడం సర్వసాధారణం.

మే 4న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటి వరకు 15 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలోవేల సంఖ్యలో దీన్ని లైక్ చేసారు. కొంతమంది వినియోగదారులు వీడియోపై కూడా వ్యాఖ్యానించారు. ప్రకృతిని రక్షించే వారికి సెల్యూట్ అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు తమాషాగా అది కాటేస్తే ఏం కాదు.. మనిషి చనిపోతాడు అంతే అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..