- Telugu News Photo Gallery Beaches to visit in India in Summer season which you didn't know about Telugu News
ప్రకృతిలో దాగివున్న అద్భుతమైన సముద్ర తీరాలు.. మీరు ఇప్పటి వరకు చూడనివి.. మన దేశంలోనే..
మన దేశంలో మనం ఇంతవరకు చూడని అనేక సముద్ర తీరాలు మిగిలే ఉన్నాయి. అలాంటి బీచ్‌లను ఈ సమ్మర్ హాలీడేస్‌లో ప్లాన్ చేసుకోండి.. మీకు అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. అద్భుతమైన ప్రకృతి అందాలు, విభిన్న అనుభూతినిచ్చే ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 11, 2023 | 1:45 PM

Daman And Diu Tourism- దేశానికి పశ్చిమ దిక్కున ఉన్న సముద్ర తీర ప్రాంతాలివి. ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు. పోర్చుగీసు, భారతీయ సాంప్రదాయలు రెండూ ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం పోర్చుగీసు పాలనలో ఉండేది. సముద్ర తీరాలతో పాటు చారిత్రక కట్టడాలు, చర్చిలు చాలా ఉన్నాయి

Gokarna- కర్ణాటక రాష్ట్ర పశ్చిమ తీరంలో ఉందీ గోకర్ణ పట్టణం. ఈ మధ్య టూరిస్టులకి ఇది మంచి డెస్టినేషన్ అయ్యిందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడి బీచులు ఇంకా అంతగా అభివృద్ధి కాలేదు. బీచులతో పాటే ప్రకృతి అందాలకోసం చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి.

Mandvi- ఇది గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతం. నౌకాతయారీ పరిశ్రమలు, బీచులకు ఇది ప్రసిద్ధి. స్థానికి షిప్ యార్డులు, చెక్క నౌకల్ని చేతితో ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూడొచ్చు.

Tarkarli Beach- మహారాష్ట్ర లో ఉన్న ఈ సముద్ర తీరం స్పష్టమైన సముద్రజలాలకు, పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. ఇక్కడ స్కూబా డైవింగ్, స్నార్కిలింగ్ లాంటి నీటి విన్యాసాలు చేయొచ్చు. వీటితో పాటే కొన్ని చారిత్రాత్మక కట్టడాలు, గుళ్లు ఉన్నాయి.

Varkala- కొండలు, అరేబియన్ సముద్రానికి ఇది పేరు పొందింది. ఈ ప్రదేశంలో కొన్ని ఆయుర్వేదిక్ స్పాలు కూడా ఉన్నాయి.




