AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

watch: హెల్మెట్‌ ఉంది కదా అని ఏనుగుకే ఎదురెళ్లాడు.. ! కానీ, తిక్క కుదిరింది..

వన్యప్రాణులను బోనుల్లో చూడటం వేరే విషయం. కానీ అడవిలో వారి సహజ వాతావరణంలో వాటిని చూడాలనుకోవటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనుషులు తమపై దాడి చేస్తారేమోనన్న భయం, ఆందోళనతో అవి మనపై దాడి చేసే అవకాశం ఉంది. ఇది అలాంటి సంఘటనే.

watch: హెల్మెట్‌ ఉంది కదా అని ఏనుగుకే ఎదురెళ్లాడు.. ! కానీ, తిక్క కుదిరింది..
Elephant
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2023 | 12:28 PM

సోషల్ మీడియా ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నాయి. మనం ఊహించలేనివన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. మనం ఇంటర్నెట్‌లో చూసే వీడియోలలో ఒక్కోసారి నవ్వు తెప్పించేవి, ఒక్కోసారి ఆలోచింపజేసేవి, ఒక్కోసారి ఆశ్చర్యం కలిగించేవి, ఒక్కోసారి బాధ కలిగించేవి కూడా ఎన్నో ఉంటాయి. జంతువుల వీడియోలకు ఇంటర్నెట్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో అనేక థ్రిల్లింగ్ వీడియోలు కనిపిస్తాయి. చాలా మంది వినియోగదారులు తమ ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను చూడటానికి ఇష్టపడతారు. వాటిలో మనల్ని ఉర్రూతలూగించే ఎన్నో ఆసక్తికర విషయాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా జంగిల్ సఫారీని ఆస్వాదించేందుకు వచ్చిన వారిపై అడవి ఏనుడు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు సైతం భయపడుతున్నారు. సాధారణంగా, వన్యప్రాణుల పట్ల ప్రజలకున్న ఆకర్షణ కారణంగా చాలా మంది జంగిల్ ట్రెక్కింగ్, జంగిల్ సఫారీకి వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు వారు అడవి జంతువులకు ఎదురు పడటం, అవి దాడి చేసేందుకు ప్రయత్నించగా తృటిలో తప్పించుకున్న సంఘటనలు కూడా ఇటీవల అనేకం చూస్తున్నాం. ఇక్కడ కూడా అలాంటి సీనే ఎదురైంది.

ఇవి కూడా చదవండి

వన్యప్రాణులను బోనుల్లో చూడటం వేరే విషయం. కానీ అడవిలో వారి సహజ వాతావరణంలో వాటిని చూడాలనుకోవటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనుషులు తమపై దాడి చేస్తారేమోనన్న భయం, ఆందోళనతో అవి మనపై దాడి చేసే అవకాశం ఉంది. ఇది అలాంటి సంఘటనే. జంగిల్ సఫారీ వాహనం వెనుక దాడి చేయడానికి ఏనుగు పరుగెత్తడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది ఇంటర్నెట్‌లో చూశారు. ఇందులో హెల్మెట్ ధరించిన వ్యక్తి ప్రయాణికులతో నిండిన వాహనం సమీపంలో హైవే వెంబడి నడుస్తున్నాడు. ఆ సమీపంలోనే ఒక పెద్ద ఏనుగు నిలబడి ఉంది..పర్యాటకుల్ని చూసిన ఆ ఏనుగు.. తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోయింది…పర్యాటకులపై దాడికి ప్రయత్నించింది.

వీడియోలో, హెల్మెట్ ధరించిన వ్యక్తి ఏనుగు నుండి తనను తాను రక్షించుకోవడానికి పరిగెత్తుతున్నాడు. ఈ సమయంలో జంగిల్ సఫారీ వాహనంలో ఉన్న పర్యాటకులు ఏనుగు తమ వైపుకు రావడం చూసి అరుస్తూ సందడి చేశారు. దీంతో ఏనుగు మరింత ఉగ్రరూపం దాల్చింది. తర్వాత, డ్రైవర్ సమయానికి వాహనాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత హెల్మెట్‌ ధరించిన వ్యక్తి మరింత వేగంగా అక్కడ్నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చాలా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయబడింది. @WildLense_India ఖాతా ద్వారా ట్విట్టర్‌లో వీడియో షేర్ చేయబడింది. వేల సంఖ్యలో నెటిజన్లు వీడియోను వీక్షించారు. వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని  ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..