AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: తోపు బౌలర్‌ల ఫీలయ్యావ్.. మ్యాచ్‌నే ముంచేశావ్ కదా బ్రో.. నువ్వూ.. నీ చెత్త కెప్టెన్సీ.. రాణాపై నెటిజన్ల ఫైర్..

ఐపీఎల్‌-2023లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులు బ్రేక్ అవ్వగా, మరికొన్నినమోదయాయి. అయితే, రాజస్తాన్‌ యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ కోల్‌కతా బౌలర్లను ఊచకోత కోసి, బౌండరీల వర్షం కురిపించాడు.

Video: తోపు బౌలర్‌ల ఫీలయ్యావ్.. మ్యాచ్‌నే ముంచేశావ్ కదా బ్రో.. నువ్వూ.. నీ చెత్త కెప్టెన్సీ.. రాణాపై నెటిజన్ల ఫైర్..
Nitish Rana Kkr Vs Rr
Venkata Chari
|

Updated on: May 12, 2023 | 11:19 AM

Share

ఐపీఎల్‌-2023లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులు బ్రేక్ అవ్వగా, మరికొన్నినమోదయాయి. అయితే, రాజస్తాన్‌ యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ కోల్‌కతా బౌలర్లను ఊచకోత కోసి, బౌండరీల వర్షం కురిపించాడు. తొలి ఓవర్ తొలి బంతి నుంచే ప్రత్యర్ది బౌలర్లపై విరుచుకపడ్డాడు. మరీ ముఖ్యంగా కోల్‌కతా సారథి నితీష్‌ రాణాకు మాత్రం పీడకలను మిగిల్చాడు. దీంతో సోషల్ మీడియాలో రాణాపై విమర్శల వర్షం కురుస్తోంది. అందుకు ఓ కారణం కూడా ఉంది.

ఎందుకంటే, రస్సెల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి లాంటి దిగ్గజ బౌలర్లు కేకేఆర్ టీంలో ఉన్నా.. వారిని కాదని, తొలి ఓవర్‌ వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదే అదునుగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జైస్వాల్.. నితీష్‌ రాణా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. కేకేఆర్ సారథి వేసిన తొలి ఓవర్‌లో జైశ్వాల్‌ ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇన్నింగ్స్‌లో తొలి 2 బంతుల్లో 2 సిక్సర్లు బాదిన జైస్వాల్.. తర్వాతి రెండు బంతులను ఫోర్లుగా మలిచాడు. 5వ బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి ఫోరు బాదడంతో మొత్తంగా తొలి ఓవర్‌లోనే 26 పరుగులు రాబట్టి, గట్టి పునాదికి నాంది వేశాడు. ఆ తర్వాత రెండో, మూడో ఓవర్‌లోనూ భారీ షాట్లు కొట్టి కేవలం 13 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేశాడు. యశస్వి 47 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకంగా నిలిచింది.

దీంతో నితీష్ రాణాపై నెటిజన్లు విమర్శలు గుప్పస్తున్నారు. తొలి ఓవర్ వేసి మ్యాచ్‌ రూపాన్నే మార్చేశావంటూ తిట్టిపోస్తున్నారు. తోపు బౌలర్‌లా ఫీలయ్యావు, జట్టునే ఓటమిపాలు చేశావంటూ కామెంట్లు చేస్తున్నారు. నువ్వూ, నీ చెత్త కెప్టెన్సీకి ఓ దండం బ్రో అంటూ పోస్టులు పెడుతున్నారు. #NitishRana ట్యాగ్ తో దారుణంగా కామెంట్లు చేస్తూ,ఈ ఆటగాడిని ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..