Video: గాల్లో తేలుతూ ఒకరు.. బౌండరీ లైన్ చెంత మరొకరు.. కళ్లు చెదిరే క్యాచ్‌లతో దుమ్ము రేపిన ప్లేయర్స్..

KKR vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించడమే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఈ టోర్నీలో ఆటగాళ్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుని, ప్రేక్షకులకే కాదు బ్యాటర్లకు కూడా షాక్ ఇస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సీనే కనిపించింది.

Video: గాల్లో తేలుతూ ఒకరు.. బౌండరీ లైన్ చెంత మరొకరు.. కళ్లు చెదిరే క్యాచ్‌లతో దుమ్ము రేపిన ప్లేయర్స్..
Kkr Vs Rr Viral Catch
Follow us
Venkata Chari

|

Updated on: May 12, 2023 | 12:25 PM

KKR vs RR, IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించడమే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఈ టోర్నీలో ఆటగాళ్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుని, ప్రేక్షకులకే కాదు బ్యాటర్లకు కూడా షాక్ ఇస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సీనే కనిపించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ షిమ్రాన్ హెట్మెయర్, సందీప్ శర్మ అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

హెట్మెయర్ అద్భుత క్యాచ్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఆరంభం ప్రత్యేకంగా ఏమీ లేదు. మూడో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ జాసన్ రాయ్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. హెట్మెయర్ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. హెట్‌మెయర్‌ బౌండరీలో పట్టిన క్యాచ్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బౌల్ట్ బౌలింగ్‌లో రాయ్ క్రీజు బయటకు వెళ్లి, లెగ్ స్టంప్‌పై ఫుల్లర్ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, నేరుగా డీప్ స్క్వేర్ లెగ్ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. హెట్మెయర్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

ఇవి కూడా చదవండి

గాల్లో తేలి క్యాచ్ పట్టిన సందీప్ శర్మ..

5వ ఓవర్ తొలి బంతికే కేకేఆర్ రెండో వికెట్ పడింది. బౌల్ట్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుర్బాజ్ 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఈసారి గుర్బాజ్‌ను సందీప్ శర్మ అత్యుత్తమ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. బౌల్ట్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్.. మిడ్ ఆఫ్ దిశలో ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. డైవింగ్ చేస్తూ సందీప్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. మ్యాచ్‌లో రాజస్థాన్‌ నుంచి అద్భుతమైన ఫీల్డింగ్‌ కనిపించింది. క్యాచ్‌లతో పాటు ఫీల్డర్లు చాలా పరుగులు కాపాడారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..