AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs GT: మే 12 అంటే ముంబై ఇండియన్స్‌కు పూనకాలే.. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ ఓడలే.. ఆ స్పెషల్ ఏంటో తెలుసా

IPL 2023: ఐపీఎల్‌లో మే 12వ తేదీన ఆడిన మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు ఓడిపోలేదు. మరి నేడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్‌తో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయనుందా?

MI vs GT: మే 12 అంటే ముంబై ఇండియన్స్‌కు పూనకాలే.. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ ఓడలే..  ఆ స్పెషల్ ఏంటో తెలుసా
Mumbai Indians
Venkata Chari
|

Updated on: May 12, 2023 | 12:42 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 57వ మ్యాచ్ ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించడమే గుజరాత్ ఉద్దేశం. అదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్‌ను ఓడించడం ద్వారా ప్లేఆఫ్స్‌కు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు మే 12 అంటే ఎంతో అదృష్టమైన రోజుగా నిలిచింది. ఈ రోజు ముంబై ఇండియన్స్ మాజీ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ పుట్టినరోజు. కీరన్ పొలార్డ్ పుట్టినరోజు సందర్భంగా ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు ఓడిపోకపోవడం గమనార్హం.

బ్యాటింగ్ కోచ్‌గా పొలార్డ్..

వెస్టిండీస్ మాజీ కెప్టెన్, తుఫాను బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరపున 13 సీజన్లు ఆడాడు. అతను 2010 సంవత్సరంలో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. IPL నుంచి రిటైర్ అయ్యే వరకు ఈ జట్టుతో ఆడటం కొనసాగించాడు. ఐపీఎల్‌లో ఒకే జట్టు తరఫున ఆడిన అతికొద్ది మంది క్రికెటర్లలో పొలార్డ్ ఒకరు. అతని హయాంలో ముంబై 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కంటే ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు పొలార్డ్ నిలిచాడు. అతను ముంబై తరపున 13 సీజన్లలో 16 అర్ధ సెంచరీలతో సహా 3412 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

పొలార్డ్ పుట్టినరోజున ముంబై ఇండియన్స్ ఓడిపోలే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో కీరన్ పొలార్డ్ పుట్టినరోజున ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు ఓడిపోలేదు. 2009లో తొలిసారిగా మే 12న ముంబై మ్యాచ్ ఆడింది. ఆ సమయంలో పొలార్డ్ ఐపీఎల్ అరంగేట్రం జరగలేదు. ఆ తర్వాత సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)పై విజయం సాధించింది. అప్పటి నుంచి మే 12న జరిగే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. గతేడాది మే 12న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మొత్తంమీద, కీరన్ పొలార్డ్ ఇప్పటివరకు తన పుట్టినరోజున తన జట్టుకు అదృష్టాన్ని నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం నమోదు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..