AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: 7 మ్యాచ్‌లు 19 పరుగులు.. బెంగళూరును ప్లేఆఫ్స్‌కు దూరం చేస్తోన్న నలుగురు బ్యాటర్స్..

IPL 2023: ఐపీఎల్ సీజన్ 16లో ఆర్‌సీబీ జట్టు మొత్తం 11 మ్యాచ్‌లను పూర్తి చేసింది. ఈ పదకొండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆర్సీబీ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం కూడా 6 మ్యాచ్‌ల ఓటమికి ఒక కారణంగా నిలిచింది.

IPL 2023: 7 మ్యాచ్‌లు 19 పరుగులు.. బెంగళూరును ప్లేఆఫ్స్‌కు దూరం చేస్తోన్న నలుగురు బ్యాటర్స్..
Rcb
Venkata Chari
|

Updated on: May 12, 2023 | 10:18 AM

Share

IPL 2023: ఐపీఎల్ సీజన్ 16లో ఆర్‌సీబీ జట్టు మొత్తం 11 మ్యాచ్‌లను పూర్తి చేసింది. ఈ పదకొండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆర్సీబీ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం కూడా 6 మ్యాచ్‌ల ఓటమికి ఒక కారణంగా నిలిచింది. అంటే ఇక్కడ RCB జట్టు పూర్తిగా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌పైనే ఆధారపడి ఉందని తెలుస్తోంది. విరాట్ కోహ్లి (420), ఫాఫ్ డుప్లెసిస్ (576), గ్లెన్ మాక్స్‌వెల్ (330) పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనంగా మారింది. ఆశ్చర్యకరంగా ఈ ముగ్గురు మినహా ఆర్‌సీబీ జట్టులో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 150 పరుగులు కూడా చేయలేదు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే RCB 3వ ఆర్డర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గత 7 మ్యాచ్‌ల్లో మూడో ఆర్డర్‌లో నలుగురిని రంగంలోకి దించారు. అయితే ఈ క్రమంలో ఎవరూ ఆకట్టుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

గత 7 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ జట్టు 3వ ఆర్డర్ స్కోరు వివరాలను పరిశీలిస్తే… 0 (మహిపాల్ లోమ్రార్), 0 (గ్లెన్ మాక్స్‌వెల్), 2 పరుగులు (షహబాజ్ అహ్మద్), 2 పరుగులు (షహబాజ్ అహ్మద్), 9 ( అనుజ్ రావత్), 0 (గ్లెన్ మాక్స్‌వెల్), 6 (అనుజ్ రావత్).. అంటే ఏడు మ్యాచ్‌లలో 3వ ఆర్డర్ నుంచి మొత్తం స్కోరు 19 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆర్‌సీబీ బండి గాడి తప్పినట్లైంది.

ఇవి కూడా చదవండి

ఓపెనర్ల తర్వాత కీలక పాత్ర పోషించే మూడో ఆర్డర్‌లో ఆర్‌సీబీ వరుస వైఫల్యాలను చవిచూసింది. ఇది కూడా ఆర్సీబీ ఓటమికి ఓ కారణమని చెప్పొచ్చు. RCB విజయంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ జీరో అని చెప్పొచ్చు.

అయితే 5 మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ జట్టు తదుపరి 3 మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాలని భావిస్తోంది. మరి ఈ లెక్క రివర్స్ అవుతుందో లేదో మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

RCB జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, మైకేల్ బ్రేస్‌వెల్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, వానిందు , మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, కేదార్ జాదవ్, సుయాష్ ప్రభుదేశాయ్, మనోజ్ భాండాగే, సోను యాదవ్, వేన్ పార్నెల్, వైశాక్ విజయకుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..