Yuzvendra Chahal: ఐపీఎల్ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్.. తొలి బౌలర్‌గా నిలిచిన చాహల్..
IPL History: RCB ఫ్రాంచైజీ 2021 తర్వాత చాహల్‌ను జట్టు నుంచి తప్పించడం ద్వారా ఆశ్చర్యపరిచింది. కానీ, ఈ బౌలర్ ప్రతీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురిపిస్తూ.. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
IPL 2023: ఐపీఎల్ 56వ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌పై 11వ ఓవర్‌లో చాహల్ దాడి చేశాడు. యుజ్వేంద్ర చాహల్ తన తొలి ఓవర్‌లోనే కేకేఆర్ రాణా వికెట్ తీసి ఐపీఎల్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు డ్వేన్ బ్రావో పేరిట ఉండేది.
డ్వేన్ బ్రావో CSK, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ తరపున మొత్తం 158 ఇన్నింగ్స్‌లలో 183 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ రికార్డును యుజ్వేంద్ర చాహల్ తుడిచిపెట్టాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం 142 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసిన చాహల్.. 187 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
విశేషమేమిటంటే.. ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా చాహల్ పేరిటే ఉంది. 2014 నుంచి 2021 వరకు RCB తరపున 113 మ్యాచ్‌లు ఆడిన యుజ్వేంద్ర చాహల్ మొత్తం 139 వికెట్లు పడగొట్టాడు. RCB తరపున అత్యధిక వికెట్లు తీసి రికార్డు సృష్టించిన చాహల్‌ను 2021 తర్వాత జట్టు నుంచి తప్పించి RCB ఫ్రాంచైజీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న చాహల్ గత సీజన్‌లో 27 వికెట్లు పడగొట్టాడు. అలాగే, ఈ ఐపీఎల్‌లో మొత్తం 21 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..