AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Metro News: మార్కెట్‌ మాయాజాలం..! మెట్రో స్టేషన్ల పేరులో మార్పులు.. ఇదెక్కడి విడ్డూరం అంటున్న నెటిజన్లు..

ప్రస్తుతమంతా బిజినెస్ యుగం.. ఎక్కడ చూసినా, ఏది చేసినా మార్కెట్ తో ముడిపడి ఉంటుంది. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఈ వైరల్ ఫోటో మెట్రో కోచ్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన డిస్‌ప్లే బోర్డ్.  ఇందులో ఇతర మెట్రో స్టేషన్‌ల పేరుతో కాకుండా..

Mumbai Metro News: మార్కెట్‌ మాయాజాలం..! మెట్రో స్టేషన్ల పేరులో మార్పులు.. ఇదెక్కడి విడ్డూరం అంటున్న నెటిజన్లు..
Mumbai Metro
Follow us
Jyothi Gadda

|

Updated on: May 12, 2023 | 1:06 PM

లోకల్ ట్రైన్‌ను ముంబై లైఫ్ లైన్ అంటారు. అవును, ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి, సమయానికి తమ గమ్యాన్ని చేరుకోవడానికి ‘మాయా నగరి’లో ప్రతిరోజూ లక్షలాది మంది లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే, పౌరుల ప్రయాణాన్ని మెరుగుపరచడానికి ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (MMRDA) సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం ముంబయి మెట్రో’ని ప్రారంభించింది. దీంతో ప్రజలు రద్దీ లేకుండా తక్కువ సమయంలో అది కూడా ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లలో ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం ముంబై మెట్రో రైలు కోచ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ముంబై మెట్రో స్టేషన్ పేరు ఒక బోర్డుపై ఒక విధంగా, మరోచోట మరో విధంగా రాసి ఉండటం చూసి ప్రయాణికులు కంగుతిన్నారు. ఇదేంటని కంగారు పడ్డారు.

ప్రస్తుతమంతా బిజినెస్ యుగం.. ఎక్కడ చూసినా, ఏది చేసినా మార్కెట్ తో ముడిపడి ఉంటుంది. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఈ వైరల్ ఫోటో మెట్రో కోచ్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన డిస్‌ప్లే బోర్డ్.  ఇందులో ఇతర మెట్రో స్టేషన్‌ల పేరుతో కాకుండా, వాటికి ప్రసిద్ధ బ్రాండ్ పేరు కూడా జోడించబడింది. ఇలా – LIC అంధేరి, మెడిమిక్స్ ఆజాద్ నగర్, బిస్లేరి పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్ హైవే…మొదలైనవి. ఇది మాత్రమే కాదు, ఈ స్టేషన్లలో ఒకటి వచ్చినప్పుడు, మెట్రో స్టేషన్ పేరును ప్రకటించడమే కాకుండా సంబంధిత బ్రాండ్ జింగిల్ ప్లే చేస్తుందని మరొక ట్వీట్‌లో వ్యక్తి వెల్లడించారు.ఇక ఈ వైరల్‌పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రాన్ని మే 7న పోస్ట్ చేస్తూ , @shlokafc అనే ట్విట్టర్ యూజర్ ఇలా వ్రాశారు – పెట్టుబడిదారీ విధానం తీవ్ర స్థాయికి చేరుకుంది.. అతని ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వార్తను 1 లక్ష కంటే ఎక్కువ మంది చూశారు. కాగా, సుమారు రెండున్నర వేల లైకులు వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు దీనిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..