27 ఏళ్ల ఉద్యోగంలో ఒక్క సెలవు కూడా పెట్టని ఎంప్లాయ్..! కంపెనీ ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా..?
27ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చేసినందుకు ప్రతిఫలం రిటైర్మెంట్ తర్వాత అందుకోవడం గర్వంగా ఉందని కెవిన్ అంటున్నాడు. కెవిన్ ఫోర్డ్ క్రమశిక్షణ, నిబద్ధత గురించి విదేశీ పత్రికల్లో వార్తలు ఎడతెరిపి లేకుండా ప్రచురితమవుతున్నాయి.
ఉద్యోగ సమయంలో సెలవు తీసుకోవడం అనేది చాలా మందికి చాలా కష్టంతో కూడుకున్న పని. వాస్తవానికి, కంపెనీలు తమ ఉద్యోగులకు సాధారణ, వైద్య, వేతనంతో కూడిన సెలవులను అందిస్తాయి. కానీ, చాలా మంది ఉద్యోగులు ఈ సెలవులను తీసుకోవడానికి కూడా రకరకాల సాకులు చెబుతారు. కానీ, కొందరు అవసరమైనప్పుడు మాత్రమే సెలవు పెడుతుంటారు. ఇకపోతే, ఇలాంటి సెలవులను ఉపయోగించని వారు చాలా తక్కువగా ఉంటారు.. అయితే తమ్ముడు… అమెరికాలోని ఓ ‘బర్గర్’ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి తన 27 ఏళ్ల సర్వీసులో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు! ఇప్పుడు తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కించుకున్నాడు. అవును, ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం మొత్తం అతని గురించే చర్చ నడుస్తోంది.
అమెరికాలోని లాస్‌వెగాస్‌కు చెందిన కెవిన్ ఫోర్ట్ బర్గర్‌కింగ్ చైన్ రెస్టారెంట్‌లో ఉద్యోగిగా 27సంవత్సరాల పాటు సెలవు తీసుకోకుండా పని చేసినట్లుగా కంపెనీ ప్రకటించింది.. 54 ఏళ్ల బర్గర్ కింగ్ ఉద్యోగి కెవిన్ ఫోర్డ్ ఉద్యోగం చేస్తున్నంత కాలంలో సంపాధించిన జీతం, బోనస్ సంగతి పక్కన పెడితే రిటైర్మెంట్ తర్వాత అతని సేవలు, శ్రమను గుర్తించి విరాళాల రూపంలో వస్తున్న డబ్బే ఎక్కువగా ఉంది. ఇంత సిన్సియర్‌గా ఉద్యోగం చేసిన కెవిన్ ఫోర్డ్‌కు రివార్డ్ ఇవ్వడానికి గోఫండ్‌మీ అనే క్యాంపెయిన్ ద్వారా $400,000 అమెరికన్ డాలర్లు..అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే 3.26 కోట్ల రూపాయలు అందుకున్నాడు. వ్యక్తిగత జీవితం కోసం వృత్తిని నమ్ముకొని పని చేసినందుకు కెవిన్ ఫోర్డ్‌కు రిటైర్మెంట్ తర్వాత ఫలితం దక్కింది.
27ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చేసినందుకు ప్రతిఫలం రిటైర్మెంట్ తర్వాత అందుకోవడం గర్వంగా ఉందని కెవిన్ అంటున్నాడు. కెవిన్ ఫోర్డ్ క్రమశిక్షణ, నిబద్ధత గురించి విదేశీ పత్రికల్లో వార్తలు ఎడతెరిపి లేకుండా ప్రచురితమవుతున్నాయి. జీతం, బోనస్ కంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో, తన ఇద్దరు పిల్లలతో కెవిన్ ఫోర్డ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. కోట్లు సంపాధించాలంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాల్సిన పని లేదని ..కేవలం చేస్తున్న ఉద్యోగాన్ని సిన్సియర్‌గా చేస్తే గుర్తింపు, ఆదాయం దానంతటకి అదే వస్తుందని కెవిన్ ఫోర్ట్ నిరూపించాడు. ఇతనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..