Viral Video: హెల్మెట్‌ పెట్టుకోకుండా బైక్‌పై వెళ్తున్న అన్న, చెల్లెలు.. అపరాకాళిగా మారిన తల్లి.. వీడియో వైరల్

ఓ వ్యక్తి హెల్మెట్‌ పెట్టుకోకుండా తన సోదరితో కలిసి బైక్‌పైన వెళ్తున్నాడు. వారి దగ్గర హెల్మెట్‌ లేదా అంటే ఇద్దరి దగ్గరా హెల్మెట్‌లు ఉన్నాయి. అయినా వారు పెట్టుకోలేదు. అలా బైక్‌పైన వెళ్తున్న ఆ అన్న,చెల్లెలిద్దరినీ వారి తల్లి చూసింది. వెంటపడి మరీ బైక్‌ ఆపి అది రోడ్డని, అందరూ చూస్తున్నారని కూడా చూడకుండా కొడుకు చెంప చెళ్లుమనిపించింది.

Viral Video: హెల్మెట్‌ పెట్టుకోకుండా బైక్‌పై వెళ్తున్న అన్న, చెల్లెలు.. అపరాకాళిగా మారిన తల్లి.. వీడియో వైరల్
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2023 | 12:23 PM

రోడ్డుమీద బైక్‌పైన వెళ్లేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించమని.. హెల్మెట్‌ పెట్టుకోవాలని పోలీసులు జోరీగల్లా వెంటపడుతూనే ఉంటారు. అయినా మనోళ్లు వాటిని పెడ చెవిన పెడుతూనే ఉంటారు. ఫైన్‌లు వేసినా పట్టించుకోకుండా ప్రమాదాలు కొనితెచ్చుకుంటూనే ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి హెల్మెట్‌ పెట్టుకోకుండా తన సోదరితో కలిసి బైక్‌పైన వెళ్తున్నాడు. వారి దగ్గర హెల్మెట్‌ లేదా అంటే ఇద్దరి దగ్గరా హెల్మెట్‌లు ఉన్నాయి. అయినా వారు పెట్టుకోలేదు. అలా బైక్‌పైన వెళ్తున్న ఆ అన్న,చెల్లెలిద్దరినీ వారి తల్లి చూసింది. వెంటపడి మరీ బైక్‌ ఆపి అది రోడ్డని, అందరూ చూస్తున్నారని కూడా చూడకుండా కొడుకు చెంప చెళ్లుమనిపించింది. కుమార్తెను కూడా బెదిరించింది.

హెల్మెట్‌ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఎందుకు వెళ్తున్నావని నిలదీసింది. ఆ కుమారుడు తను ఎంతో దూరం వెళ్లడం లేదని, పక్కనే కదా అని హెల్మెట్‌ పెట్టుకోలేదని చెప్పినా వినలేదు. ఇంతలో ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొదట విషయం వారికి అర్థం కాలేదు. తర్వాత విషయం అర్ధమై కొడుకుని కొడుతున్న తల్లిని ఆపి, అతనికి మరోసారి ఇలా చేయొద్దని సర్ధి చెప్పారు.

అనంతరం ఆ అన్న, చెల్లెలు తల్లికి స్వీట్‌ ఇస్తూ మదర్స్‌డే శుభాకాంక్షలు చెప్పారు. దాంతో ఆ తల్లి హృదయం కరిగిపోయింది. అయినా వారికి బాధ్యతను గుర్తుచేసింది ఆ తల్లి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే