Watch: అదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నాడే..! లేకపోతేనా నిలువునా రెండు ముక్కలయ్యేవాడు..

మరణం ఎవరికైనా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ విధంగా అయినా వచ్చి తిరుతుందని ఇప్పటికే అనేక వీడియోలు, వార్తలు నిరూపించాయి. అయితే కొందరు మాత్రం మృత్యువు ద్వారం నుంచి తిరిగి వస్తారు.. అలాంటి ఈ వైరల్‌ వీడియో చూస్తే మీరూ మీరు కూడా షాక్‌ అవుతారు

Watch: అదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నాడే..!  లేకపోతేనా నిలువునా రెండు ముక్కలయ్యేవాడు..
Mirror Fell On Him
Follow us
Jyothi Gadda

|

Updated on: May 14, 2023 | 11:56 AM

వైరల్ వీడియోలకు సోషల్ మీడియా వేదిక. ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. కొన్ని వీడియోలు చూస్తుంటే భయంతో ఒళ్లు వణికిపోతుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి మృత్యువు అంచున వరకు వెళ్లాడు. కానీ, చావుకు ఇంకా టైమ్‌ ఉందన్నట్టుగా అతడు చావు నోట్లో తలపెట్టి బయటపడ్డాడు అనే మాటలను ఈ వీడియో రుజువు చేస్తోంది. మరణం ఎవరికైనా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ విధంగా అయినా వచ్చి తిరుతుందని ఇప్పటికే అనేక వీడియోలు, వార్తలు నిరూపించాయి. అయితే కొందరు మాత్రం మృత్యువు ద్వారం నుంచి తిరిగి వస్తారు.. అలాంటి ఈ వైరల్‌ వీడియో చూస్తే మీరూ మీరు కూడా షాక్‌ అవుతారు

ఈ వీడియోలో రోడ్డు పక్కన హాయిగా నడుస్తున్న వ్యక్తిని చూడొచ్చు. ఇంతలో పైనుంచి పెద్ద గాజు పలక అతని తలపై పడింది. పొడవు, వెడల్పు కలిగి భారీ సైజున్న గాజు పలక అతని తలపై పడి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. దాంతో ఆ వ్యక్తి తలపై కట్టుకున్న బట్ట ఊడిపోయి పడిపోయింది. అద్దం తాకిడికి ఆ వ్యక్తి బలంగా కింద పడిపోయాడు. అదృష్టవంతుడు తలపై గాజుముక్క గుచ్చుకోలేదు. లేకుంటే అక్కడికక్కడే అతని శరీరం రెండుగా చీలిపోయేది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారగా, వీడియోపై అనేక స్పందనలు వస్తున్నాయి. ఆ వ్యక్తి క్షేమంగా ఉన్నందుకు కొందరు నెటిజన్లు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.