క్యాన్సర్‌తో పోరాడుతున్న తల్లి కోసం ఆమె కొడుకు చేసిన పని..! హార్ట్ టచింగ్ వీడియో.. చూడండి

క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగికి కీమోథెరపీతో చికిత్స చేస్తారు. ఈ సమయంలో రోగి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అటువంటి సందర్భాలలో చాలా మంది రోగులు ముందుగానే తల వెంట్రుకలు తీసి గుండు చేయించుకుంటారు. అయితే, ఇక్కడ కూడా క్యాన్సర్ బారిన పడ్డ బాలుడి తల్లి..

క్యాన్సర్‌తో పోరాడుతున్న తల్లి కోసం ఆమె కొడుకు చేసిన పని..!  హార్ట్ టచింగ్ వీడియో.. చూడండి
Barber Shave
Follow us
Jyothi Gadda

|

Updated on: May 14, 2023 | 10:16 AM

తల్లీ బిడ్డల బంధం ఎప్పుడు ప్రత్యేకమైనదే. నవ మాసాలు మోయడమే కాదు, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. అందుకే తల్లి బిడ్డల అనుబంధాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. అలాగే, తల్లికి ఏదైనా జరిగితే పిల్లలు కూడా భరించలేరు. అందరిలో కొందరు మాత్రమే అమ్మనాన్నలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అందరూ అలా ఉండరు. తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడే పిల్లలు కూడా ఉంటారు. అలాంటిదే ఈ ఘటన. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి కోసం ఒక కొడుకు ఏం చేశాడో తెలిస్తే మీరు ప్రశంసించకుండా ఉండలేరు.

క్యాన్సర్ రోగి ఒంటరిగా వ్యాధితో పోరాడాల్సి ఉంటుంది. కానీ కుటుంబం మొత్తం వారికి ఆ యుద్ధంలో మద్దతుగా నిలుస్తుంది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పడే బాధను కుటుంబ సభ్యులు కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి కుటుంబం మొత్తం ఆ రోగిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. తరచూ క్యాన్సర్ పేషెంట్ అనుకోని కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో, రోగిలో ధైర్యాన్ని పెంచడానికి కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుంది. క్యాన్సర్ బారిన పడిన తన తల్లిని సంతోషపెట్టడానికి ఓ బాలుడు చేసిన పని మిమల్ని కూడా కంటతడ పెట్టుస్తుంది. ఈ వీడియోలో తల్లి, కొడుకుల మధ్య జరిగిన ఈ క్షణాలు మాటల్లో వర్ణించలేనివి.

ఇవి కూడా చదవండి

@guido.magalhaes అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి, కొడుకుకు మధ్య జరిగిన ఒక భావోద్వేగ సంఘటన వీడియోను పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్న బాలుడు బ్రెజిల్ నివాసి. వృత్తిరీత్యా హెయిర్ డ్రెస్సర్. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ తల్లి జుట్టును అతను కత్తిరించడాన్ని వీడియోలో మీరు చూడవచ్చు. క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగికి కీమోథెరపీతో చికిత్స చేస్తారు. ఈ సమయంలో రోగి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అటువంటి సందర్భాలలో చాలా మంది రోగులు ముందుగానే తల వెంట్రుకలు తీసి గుండు చేయించుకుంటారు. అయితే, ఇక్కడ కూడా క్యాన్సర్ బారిన పడ్డ బాలుడి తల్లి క్లాడియా కూడా అలాగే చేసింది. క్లాడియా గుండు చేయించుకోవటం కోసం కొడుకు సెలూన్‌కే వచ్చింది. అప్పుడు ఆ బాలుడు తన తల్లి జుట్టును ట్రిమ్మర్‌తో కత్తిరించడం ప్రారంభించాడు. ఈసారి తల్లి కళ్లలో నీళ్లు ఆగలేదు. అది చూసి ఆ కుర్రాడికి కూడా దుఃఖం తన్నుకుంటూ వచ్చింది. కానీ, అది తన మొహంలో కనపడనివ్వలేదు. ఈ సారి తల్లికి ట్రిమ్ చేయటం ఆపేసి తనకు తానే చేసుకున్నాడు.. అమ్మ చూస్తుండగానే, తన తలపై వెంట్రులకు మొత్తం తొలగించేసుకున్నాడు. ఆ కొడుకును చూసిన తల్లిమరింత భావోద్వేగానికి గురై పెద్దగా ఏడ్చింది. కానీ అతను వినలేదు. తల్లిని ఓదార్చటం కోసం తన జుట్టును తానే కత్తిరించుకున్నాడు. అంతే కాదు, సెలూన్‌లోని అతని స్నేహితులు కూడా ఈ భావోద్వేగ సమయంలో అతనికి మద్దతు ఇచ్చారు. వారు కూడా అమ్మకు అండగా తమ జుట్టు కూడా కత్తిరించుకున్నారు.. హృదయాన్ని కదిలించే ఈ వీడియోను చూసి చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నేడు చాలా మంది ఈ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కొంటున్నారు.

ఈ వీడియోకు ఐదు కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. పలువురు బాలుడిపై కామెంట్స్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లికి ఇంతకంటే మంచి సపోర్ట్ మరొకటి ఉండదని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను తన పిల్లలకు కూడా చూపించానని చెప్పాడు. ఒక మహిళకు భిన్నమైన శక్తి ఉందని, అది ప్రతిచోటా వ్యాపిస్తోందని మరో వినియోగదారు వ్యాఖ్యానించారు. ఈ వీడియో చూసిన కొందరికి కన్నీళ్లు ఆగడం కష్టంగా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..