Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విధి ఆడిన వింతనాటకం.. ఫలితాల ముందు రోజు హార్ట్‌ఎటాక్‌తో అభ్యర్థి మృతి.. ఆ మర్నాడు 3ఓట్లతో గెలుపు..

చనిపోయిన అభ్యర్థి గెలుపొందాడని తెలియగానే స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో జోరుగా చర్చనీయాంశమైంది. అంతేకాదు ఎవరి భవితవ్యంలో ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ఈ ఘటన వైరల్‌గా మారింది.

విధి ఆడిన వింతనాటకం.. ఫలితాల ముందు రోజు హార్ట్‌ఎటాక్‌తో అభ్యర్థి మృతి.. ఆ మర్నాడు 3ఓట్లతో గెలుపు..
Victorious In The Election
Follow us
Jyothi Gadda

|

Updated on: May 14, 2023 | 1:28 PM

ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఊహించలేం.. ఇందుకు తాజా ఉదాహరణ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వెలుగులోకి వచ్చింది. శనివారం ఉత్తరప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి కేవలం 3 ఓట్ల తేడాతో విజేతగా నిలిచారు. కానీ, విజయోత్సవాలు, సంబరాలు చేసుకోవడానికి ఆ అభ్యర్తి అక్కడ లేరు. ఎందుకంటే ఆ అభ్యర్థి ఫలితాలకు ఒకరోజు ముందు అంటే శుక్రవారం గుండెపోటుతో మరణించారు. చనిపోయిన అభ్యర్థి గెలుపొందాడని తెలియగానే స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ జిల్లా సుల్తాన్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది.

సమాచారం ప్రకారం, ఈ సంఘటన సుల్తాన్‌పూర్ జిల్లా కడిపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించినది. ఇక్కడ 10వ వార్డుకు ఎన్నిక జరిగింది. నిరాలా నగర్ వార్డు నెం.10 నుంచి స్వతంత్ర అభ్యర్థి సంత్ ప్రసాద్ ఎన్నికల్లో పోటీ చేశారు. శనివారం ఈ వార్డు ఫలితాలు వెలువడగా సంత్ ప్రసాద్ తన ప్రత్యర్థి రమేష్‌పై కేవలం 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శాంతారామ్‌కు 217, రమేష్‌కు 214 ఓట్లు వచ్చాయి. శుక్రవారం మామిడితోటను కాస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. సంత్ ప్రసాద్ మరణవార్త విని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.

65 ఏళ్ల సంత్ ప్రసాద్ విత్తనాలు, పండ్లు, కూరగాయలు సరఫరా చేసే వ్యాపారం చేసేవాడు. అందుకు మామిడి తోట కాంట్రాక్టు తీసుకునేవాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. సంత్ ప్రసాద్ మృతితో కడిపూర్ మున్సిపాలిటీ నిరాల నగర్ వార్డు నెం.10 స్థానం ఖాళీ అవుతుందని, వార్డు మెంబర్ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో జోరుగా చర్చనీయాంశమైంది. అంతేకాదు ఎవరి భవితవ్యంలో ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..