Karnataka Results: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ, కెజ్రీవాల్ ఏమన్నారంటే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రానికి కర్ణాటకలో మాత్రమే అధికారం ఉండగా ఈసారి ఎన్నికల్లో కన్నడ ప్రజలు మోదీ సర్కార్‌ను తిరస్కరించారు. దీంతో ఆ ఉన్న రాష్ట్రం కూడా బీజేపీ కోల్పోయింది. అయితే లోక్ సభ ఎన్నికలు ఏడాది కూడా లేని నేపథ్యంలో.. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీ పతనం ప్రారంభమైందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రానికి కర్ణాటకలో మాత్రమే అధికారం ఉండగా ఈసారి ఎన్నికల్లో కన్నడ ప్రజలు మోదీ సర్కార్‌ను తిరస్కరించారు. దీంతో ఆ ఉన్న రాష్ట్రం కూడా బీజేపీ కోల్పోయింది. అయితే లోక్ సభ ఎన్నికలు ఏడాది కూడా లేని నేపథ్యంలో.. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీ పతనం ప్రారంభమైందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కన్నడ ప్రజలు తగిన గుణపాఠం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్చీ కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
ప్రజలు బహుళత్వం కోరుతున్నారని.. అణిచివేత, ఆధిపత్య ధోరణలు కాదంటూ వ్యాఖ్యానించారు. అహంకారం, అసహనాలకు వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్యం గెలవాలని కాంక్షిస్తూ, మార్పుకు ఓటేసిన కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు. మరోవైపు కర్ణాటక ఫలితమే లోక్‌సభ ఎన్నికల్లో కూడా వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. రాహుల్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడిందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేయకుండా.. పనికిమాలిన అంశాలతో ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకునే ఎత్తులు ఇకనుంచి సాగవని బీజేపీ తెలుసుకోవాలని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఇదిలా ఉండగా కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్‌కు 136 సీట్లు రాగా.. బీజేపీ కేవలం 65 స్థానాల్లోనే గెలిచింది. 19 సీట్లతో జేడీఎస్ సరిపెట్టుకోగా.. 4 గురు ఇతరులు గెలిచారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.