TDP Vs YCP: సీమలో పెరిగిన పొలిటికల్ హీట్.. అవినీతిపై లోకేష్, శిల్పా చక్రపాణిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు
ఏపీలో అధికార-ప్రతిపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం నెలకొంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలతో పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. ఇక కొద్ది కాలంగా వేష, భాషల్లో కాస్త పరిణతి చూపేందుకు తెగ ప్రయత్నిస్తున్న లోకేష్.. తన యువళగం పాదయాత్రలో వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.
మామూలుగానే ఏపీ రాజకీయ నేతల వాక్కులు చాలా వేడిగా ఉంటున్నాయి. ఇక టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం అంటే… మ్యాటర్ మీటర్ దాటి పోతోంది. ఇప్పుడీ రాజకీయ వేడి కర్నూలు వైపు మళ్లింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ సీన్ హీటెక్కిపోయింది. నారా లోకేశ్, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి మధ్య ప్రమాణాల రాజకీయం యమరంజుగా సాగుతోంది. దమ్ముంటే మహానందికి రా… అంటూ లోకేష్ టార్గెట్‌గా శిల్పా చక్రపాణి వదిలిన ఈ సవాల్‌తో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఏపీలో అధికార-ప్రతిపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం నెలకొంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలతో పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. ఇక కొద్ది కాలంగా వేష, భాషల్లో కాస్త పరిణతి చూపేందుకు తెగ ప్రయత్నిస్తున్న లోకేష్.. తన యువళగం పాదయాత్రలో వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే.. అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలపై సంచనల ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లా ఆత్మకూరు బహిరంగ సభలో మాట్లాడుతూ… ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని టార్గెట్ చేశారు నారా లోకేష్. భూకబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి దందాలు, కమీషన్లు.. చివరికి దేవుడిని కూడా వదల్లేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, బంధువులు, అనుచరులు కలిసి శ్రీశైలంను దోచుకుంటున్నారుని ఆరోపించారు.
లోకేష్ ఈతీరుగా విమర్శలు చేస్తే.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ఊరుకుంటారా..? నాకు చీటింగ్ చక్రపాణి పేరు పెట్టానన్నావ్ చాలా సంతోషం, మీ చీటింగ్ స్కూల్లో 6 ఏళ్ల పాటు చదువుకున్నా, నేను చీటింగ్ మనిషి అయితే ఒకసారి జిల్లా అధ్యక్ష పదవి, రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారు? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ నాన్న చంద్రబాబును అడుగు నేను ఎలాంటివాడినో, నా కేరక్టర్ ఏంటో చెబుతాడన్నారు. లోకేష్ నీకు దమ్ముంటే మహానందికి రా… ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దామ్ అంటూ సవాల్ విసిరారు శిల్పా చక్రపాణి.
మొత్తానికి లోకేష్ యాత్రతో సీమలో రాజకీయ వాతావరణం గరంగరంగా తయారైంది. ఇప్పటికే లోకేష్ చేసిన ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు నారా లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..