Swach Tirumala: తిరుమలలో ప్లాస్టిక్ రహిత పర్యావరణం కోసం శ్రమదానం.. పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమల స్వచ్ఛత కోసం మరో బృత్తర కార్యక్రమాన్ని చేపట్టింది టీటీడీ. శుద్ధ తిరుమల- స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు మాజీ జస్టిస్ ఎన్వీరమణ.

Swach Tirumala: తిరుమలలో ప్లాస్టిక్ రహిత పర్యావరణం కోసం శ్రమదానం.. పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎన్వీ రమణ
Swach Tirumala
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2023 | 7:25 AM

శ్రీవారి సన్నిధి తిరుమలలో శుద్ధ తిరుమల-సుందర తిరుమల కార్యక్రమం చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. శుద్ధతిరుమల – సుందర తిరుమల కొటేషన్స్ తో స్వచ్ఛంద ప్లాస్టిక్ రహిత శుభ్రత సేవా కార్యక్రమం చేపట్టారు టీటీడీ సభ్యులు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అలిపిరి వద్ద స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు మాజీ జస్టిస్ ఎన్వీ రమణ. ఆంజనేయస్వామి ఆలయం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలిసి శ్రమదానం చేశారు. రెండు కనుమదారుల్లో వాహనాల ద్వారా ప్రయాణించే భక్తులు, నడక మార్గాల్లో వచ్చే భక్తులు వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్ కవర్లను నిర్దేశించిన ప్రదేశాల్లో వేయాలనీ కోరారు ఎన్వీ రమణ.

సామూహిక శ్రమదానం కోసం మాజీ సీజేఐ ఎన్వీ రమణ స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శుద్ధ తిరుమల-సుందర తిరుమల కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. అలాగే తిరుమలకు తీసుకొచ్చే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురాకూడని కోరారు ఈవో. ఇటీవలే 1600 మంది పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించినప్పటికి.. టీటీడీ ఉద్యోగులు, ఇతర కార్పొరేషన్ల సహకారంతో 14 రోజులుగా శ్రమధానం చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను భక్తులు చెత్తకుండీల్లోనే వేయాలిని విజ్ఞప్తిచేశారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..