AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Combust 2023: కుంభంలోకి శని తిరోగమనం.. ఈ రాశులవారి ఖజానా నిండినట్లే.. లిస్టులో ఏయే రాశులు ఉన్నాయంటే..?

Saturn Combust 2023: సనాతన హిందూ ధర్మంలో జ్యోతిషశాస్త్రం, అలాగే శని దేవుడికి ప్రముఖ స్థానం ఉంది. హిందువులు నమ్మకాల ప్రకారం శని దేవుడు.. మనుషుల కర్మల ఆధారంగా వారికి న్యాయాన్ని ప్రసాదించే న్యాయవేత్త. అంటే వ్యక్తి కర్మలను బట్టి..

Saturn Combust 2023: కుంభంలోకి శని తిరోగమనం.. ఈ రాశులవారి ఖజానా నిండినట్లే.. లిస్టులో ఏయే రాశులు ఉన్నాయంటే..?
Saturn Combust To Aquarius
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 14, 2023 | 5:50 AM

Share

Saturn Combust 2023: సనాతన హిందూ ధర్మంలో జ్యోతిషశాస్త్రం, అలాగే శని దేవుడికి ప్రముఖ స్థానం ఉంది. హిందువులు నమ్మకాల ప్రకారం శని దేవుడు.. మనుషుల కర్మల ఆధారంగా వారికి న్యాయాన్ని ప్రసాదించే న్యాయవేత్త. అంటే వ్యక్తి కర్మలను బట్టి అతని జీవితంలో శుభాశుభ యోగాలు కలిగేలా చేస్తాడు. స్వయంగా సూర్యభగవానుడి కుమారుడైన శని ఈ ఏడాది జనవరిలో కుంభరాశిలోకి ప్రవేశించాడు. అయితే ఇప్పుడు మరో సారి అంటే జూన్ 17న కుంభరాశిలోకి తిరోగమనం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల స్థితిగతులు రాశిచక్రంలోని అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే శని దేవుడి తిరోగమనం అన్ని రాశులపై ప్రభావం చూపనుంది. అలాగే ఈ తిరోగమనం రాశిచక్రమంలోని 3 రాశులకు కనకవృష్టిలా మారనుంది. ఫలితంగా ఆయా రాశులవారు ఈ సమయంలో అద్వితీయంగా వెలిగిపోనున్నారు. మరి ఆ అదృష్టరాశులమేటో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహ రాశి: సింహరాశి సూర్యుడు అధిపతి. ఈ క్రమంలో కుంభరాశిలోకి సూర్యుని పుత్రుడైన శని తిరోగమనం శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో త్వరగా పూర్తవుతాయి. ఇంకా ఆకస్మిక ధనం, భారీ సంపద, కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి.

మకర రాశి: కుంభరాశిలోకి శని తిరోగమనం మకరరాశి వారికి ఫలప్రదంగా ఉండనుంది. ఈ తిరోగమన సమయంలో మకరరాశివారు అధికంగా డబ్బును ఆదా చేయగలరు. ఇంకా కుటుంబ సంతోషం, శ్రేయస్సు రెట్టింపవుతుంది. స్థిరచరాస్తుల వృద్ధి, వ్యాపారంలో లాభాలను పొందుతారు.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: శని గ్రహ తిరోగమనం ధనుస్సురాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడడంతో పాటు వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ముఖ్యంగా మీరు మొదలు పెట్టిన ప్రతిపనిలో విజయంతో వెలిగిపోతారు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..