AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tea: మీ చిట్టి గుండె ఆరోగ్యం కోసం గ్రీన్ టీ.. నిత్యం తాగితే ఇంకెన్ని ప్రయోజనాలో.. ఇప్పుడే తెలుసుకుందాం రండి..

Green Tea: మనలో చాలా మందికి టీ అంటే చాలా ఇష్టం. టీ వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మాములు టీ కంటే గ్రీన్‌ టీతో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ టీలో ఉండే లక్షణాలు మన ఆరోగ్యాన్ని కాపడడంలో ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తాయని..

Green Tea: మీ చిట్టి గుండె ఆరోగ్యం కోసం గ్రీన్ టీ.. నిత్యం తాగితే ఇంకెన్ని ప్రయోజనాలో.. ఇప్పుడే తెలుసుకుందాం రండి..
Green Tea
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 14, 2023 | 6:05 AM

Share

Green Tea: మనలో చాలా మందికి టీ అంటే చాలా ఇష్టం. టీ వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మాములు టీ కంటే గ్రీన్‌ టీతో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ టీలో ఉండే లక్షణాలు మన ఆరోగ్యాన్ని కాపడడంలో ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తాయని వారు పేర్కొంటున్నారు. ఈ టీ తాగితే బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటీస్‌తో బాధపడేవారికి లాభం చేకూరుతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా గుండెపోటు సమస్యను నిరోధించేందుకు ఈ తప్పక తాగాలని అంటున్నారు. అసలు గ్రీన్ టీతో ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్‌కు చెక్: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడమే గుండెపోటుతో సహా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణం. అయితే ఈ కొలెస్ట్రాల్‌ని గ్రీన్ టీతో తేలికగా తొలగించుకోవచ్చు. అవును ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి గ్రీన్ టీ తాగితే మీ గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునేవారికి గ్రీన్‌ మెరుగ్గా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను వేగవంతం చేయడమే కాక శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి. అలాగే గ్రీన్ టీ తాగిన తర్వాత వ్యాయామం చేస్తే కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుంది. ఫలితంగా మీ బరువును అదుపులో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

స్కిన్ ఇన్ఫెక్షన్‌కి చెక్: చర్మ సంరక్షణలో కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. ఎలా అంటే గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని నిర్జీవ కణాలను సరిచేయడంలో సహాయపడతాయి. ఫలితంగా స్కిన్ ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ సమస్యను కూడా తొలగిపోతుంది. అంతేకాక మొటిమలను నివారించడంలో కూడా గ్రీన్ టీ ఉపకరిస్తుంది.

క్యాన్సర్ నివారణ: క్యాన్సర్ సమస్యను నిరోధించేందుకు  క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగితే చాలు. శరీరంలోని ట్యూమర్లు, క్యాన్సర్ కణాలను నివారించడంలో సహాయపడే పాలీఫెనాల్స్ గ్రీన్ టీలో ఉన్నాయి. ఫలితంగా రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్: రోజుకు కనీసం 2-3 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల డయాబెటిస్‌తో బాధపడేవారిలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. గ్రీన్ టీలోని కాటెచిన్స్ అనే లక్షణాలు ఇందుకు సహాయపడతాయి. ఫలితంగా మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

మెంటల్ హెల్త్: బిజీ బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా ప్రశాంతతను కోల్పోయినవారికి గ్రీన్ టీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ మెదడుకు నిరోధక న్యూరోట్రాన్స్‌ మీటర్ల ప్రక్రియను నిరోధించేందుకు పనిచేస్తుంది. ఫలితంగా మీ  జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇంకా మీపై ఉండే ఒత్తిడి కూడా తగ్గుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..