Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ‘గాంధీ ఐడియాలజీ సెంటర్’పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కి ట్రైనింగ్ సెంటర్‌‌ కాబోతుందంటూ..

Telangana Congress: తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లి వేదికగా నిర్మించబోతున్న ‘గాంధీ ఐడియాలజీ సెంటర్’ గురించి టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని బోయినపల్లి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ‌కి ట్రైనింగ్ సెంటర్‌గా మారబోతుందని, ఈ సెంటర్ 365 రోజులూ పని..

Telangana Congress: ‘గాంధీ ఐడియాలజీ సెంటర్’పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కి ట్రైనింగ్ సెంటర్‌‌ కాబోతుందంటూ..
Revanth Reddy On Gandhi Ideology Centre
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 12, 2023 | 6:59 PM

Telangana Congress: తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లి వేదికగా నిర్మించబోతున్న ‘గాంధీ ఐడియాలజీ సెంటర్’ గురించి టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని బోయినపల్లి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ‌కి ట్రైనింగ్ సెంటర్‌గా మారబోతుందని, ఈ సెంటర్ 365 రోజులూ పని చేస్తందని రేవంత్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘గాంధీ ఐడియాలజీ సెంటర్‌ని ఎంతో కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ లీడర్లు ఇక్కడ శిక్షణ తీసుకుంటారు. ఎయిర్ పోర్ట్‌ నుంచి ఇక్కడకు 40 నిమిషాల్లో రావడానికి వీలుంది. దీని పక్కనే రాష్ట్రపతి నిలయం ఉంది. ఇలాంటి ప్లేస్ ఎక్కడా లేదు. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు వాడుకోడానికి ఇందులో వీలుంద’ని పేర్కొన్నారు.

ఇంకా ‘ఇంటెర్నేషన్ స్థాయిలో ట్రైనింగ్ సెంటర్, వసతి గదుల నిర్మాణం చేయబోతున్నాం. ఈ ల్యాండ్‌ను గాంధీ ఐడియాలజీ సెంటర్ కోసం కేటాయించిన నేత(వైఎస్ రాజశేఖర్ రెడ్డి) ఇప్పటికే చనిపోయారు. అలా నాకు ఇప్పుడు ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. మా పార్టీకే భూ కేటాయింపులు జరగలేదు. కానీ అన్ని పార్టీలకు భూకేటాయింపులు జరిగాయి. ఇది కాన్సిల్ చేస్తే అందరికీ కాన్సిల్ చెయ్యాల్సి ఉంటుంది. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్‌లో కాన్సిల్ చెయ్యాలని అనుకున్నారు. దానికి కౌంటర్ పిటీషన్ దాఖలు చేశాను. తెలంగాణ సర్కార్ ఈ భూమిని లాక్కునే ప్రయత్నం చేసింద’ని అన్నారు. ఇక గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు జూన్ మొదటి వారంలో సోనియా గాంధీ శంకుస్థాపన చేయనున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం

ఇవి కూడా చదవండి

మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. కర్ణాటకలో కాాంగ్రెస్ గెలుపు ఖాయమని, అక్కడ కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కూడా మా పార్టీయే అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు రేవంత్. ‘కర్ణాటకలో బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ పనిచేశారు. జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్)తో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కుమారస్వామి సింగపూర్‌లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉండి చక్రం తిప్పే పనిలో ఉన్నారు. కర్ణాటకలో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదు..? బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అనేది కర్ణాటక ఎన్నికల్లో స్పష్టమైంది. కర్ణాటకలో తెలుగు ఓటర్లు ప్రభావితం చేసే సెగ్మెంట్లు 78 వరకు వున్నాయి. మరి ఆ సెగ్మెంట్ల ప్రజలకు కేసీఆర్ బీజేపీని ఓడించమని ఎందుకు పిలుపునివ్వలేదు’ అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి