Telangana: నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై దూసుకెళ్తున్నారా? ఇక దబిడి దిబిడే..!

వాహనదారులు తమ వాహనాలకు విధిగా నెంబర్ ప్లేట్స్ వాడి నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు రాచకొండ జాయింట్ సీపీ వి. సత్యనారాయణ. ఎల్బీనగర్ లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో జనవరి నుండి ఇప్పటివరకు నెంబర్ ప్లేట్లు లేని..

Telangana: నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై దూసుకెళ్తున్నారా? ఇక దబిడి దిబిడే..!
Traffic Rules
Follow us

|

Updated on: May 12, 2023 | 7:38 PM

వాహనదారులు తమ వాహనాలకు విధిగా నెంబర్ ప్లేట్స్ వాడి నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు రాచకొండ జాయింట్ సీపీ వి. సత్యనారాయణ. ఎల్బీనగర్ లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో జనవరి నుండి ఇప్పటివరకు నెంబర్ ప్లేట్లు లేని 48,998 వాహనాలకు మోటార్ వెహికల్ ఆక్ట్ ప్రకారం ఫైన్లు విధించామని తెలిపారు. దొంగతనం, చైన్ స్నాచింగ్, హత్యలు చేసేవారు, మారక ద్రవ్యాలు సరఫరా చేసేవారు ఎక్కువగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలనే ఉపయోగిస్తున్నారని తెలిపారు.

ప్రజల సంక్షేమం కోసం, నేరాలను నియంత్రించేందుకు నెంబర్ ప్లేట్లు వాడని వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు. నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపినా, మాస్క్ లతో నెంబర్ ప్లేట్ కవర్ చేసినా మోటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం రూ. 3,000 నుండి 5,000 వరకు ఫైన్ విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో పోలీసుల తనిఖీల్లో తరచూ పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ హరికృష్ణ, మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles