Harish Rao: పుత్రోత్సాహంలో మంత్రి హరీష్ రావు.. తనయుడు గ్రాడ్యూయేషన్ పట్టా అందుకోవడంతో..

Minister Harish Rao: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ఆయన కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నాడు. ఈ మేరకు యూనివర్సిటీ స్నాతకోత్సవం..

Harish Rao: పుత్రోత్సాహంలో మంత్రి హరీష్ రావు.. తనయుడు గ్రాడ్యూయేషన్ పట్టా అందుకోవడంతో..
Harish Rao With His Son Archishman
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 12, 2023 | 9:49 PM

Minister Harish Rao: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ఆయన కుమారుడు అర్చిష్మాన్  అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నాడు. ఈ మేరకు యూనివర్సిటీ స్నాతకోత్సవం అమెరికాలోని కొలరాడో కౌంటీ బౌల్డర్‌లో జరగ్గా.. అందుకలో హరీశ్ రావు కూడా హాజరయ్యారు. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అర్చిష్మాన్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు.

హరీష్  రావు తన ట్వీట్‌లో ‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలన? ఇది అతనిలోని పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షకు నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ.. ఈ ఘనమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు’ అంటూ తన తనయుడిని ఉద్దేశించి క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..